Chhaava Success :ఛావా సెన్సేష‌న్ వ‌సూళ్ల‌లో ధ‌నా ధ‌న్

రూ. 500 కోట్ల‌కు ద‌గ్గ‌ర‌గా మూవీ స్పీడ్

Chhaava : మ‌రాఠా యోధుడు ఛ‌త్ర‌ప‌తి శివాజీ త‌న‌యుడు శంభాజీ జీవితంలో చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కించిన చిత్రం ఛావా(Chhaava). ఇది ఊహించ‌ని విధంగా బిగ్ స‌క్సెస్ అయ్యింది. బాలీవుడ్ న‌టుడు విక్కీ కౌశ‌ల్ శంభాజీ పాత్ర‌లో లీన‌మై పోయి న‌టించ‌గా నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న శంభాజీ భార్య ఏసు బాయి పాత్ర‌లో మెప్పించింది.

Chhaava Movie Collections

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేమికుల దినోత్స‌వం ఫిబ్ర‌వ‌రి 14న ఛావా విడుద‌లైంది. రిలీజైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ఇప్ప‌టికే రూ. 350 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ప్ర‌స్తుతం రూ. 500 కోట్లు వ‌సూలు చేసే దిశ‌గా ముందుకు వెళుతోంది. ఈ చిత్రానికి అద్భుతంగా సంగీతం అందించాడు ఆస్కార్ విన్న‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అల్లా ర‌ఖా రెహ‌మాన్.

ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఛావా చిత్రానికి ప్రాణం పెట్టాడు. సినిమా చూసిన వాళ్లు క‌న్నీళ్లు పెడుతున్నారు. త‌ట్టుకోలేక పోతున్నారు. చివ‌ర‌కు సినిమాను చూసిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సైతం తీవ్ర భావోద్వేగానికి లోన‌వుతున్నారు. 10 రోజుల‌కే ఛావా చిత్రం హ్యూజ్ క‌లెక్ష‌న్స్ చేసింది.

ఛావాలో అక్షయ్ ఖన్నా, వినీత్ కుమార్ సింగ్, అశుతోష్ రాణా, దివ్య దత్తా, డయానా పెంటీ కూడా నటించారు.

Also Read : Javed Akthar Shocking : నాలో ప్ర‌వ‌హిస్తున్న ర‌క్తం భార‌త‌దేశం

ChhaavaCinemaCollectionsTrendingUpdates
Comments (0)
Add Comment