Chhaava : విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కలిసి నటించిన మరాఠా చారిత్రాత్మక నేపథ్యం కలిగిన చావా(Chhaava) చిత్రం రిలీజ్ కాకుండానే రికార్డ్ బ్రేక్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్ లో అరుదైన ఘనత సాధించింది. ఏకంగా కేవలం 48 గంటల్లోనే 2 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడు పోవడం సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది.
Chhaava Movie Updates
ప్రేమికుల పండుగ రోజు ఫిబ్రవరి 14న చావా(Chhaava) చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు పాత్రలో విక్కీ కౌశల్ నటించగా తన భార్య ఏసుబాయి పాత్రలో రష్మిక మందన్న నటించింది.
ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విన్నర్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇప్పటికే పాటలు, పోస్టర్స్ జనాదరణ పొందాయి. జానే తూ అనే సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చిత్రీకరణ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు అందుతున్నాయి. బలమైన సన్నివేశాలు, ఆనాటి విరోచిత పోరాట గాధను తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని సినీ క్రిటిక్స్ పేర్కొంటున్నారు.
ఇక నేషనల్ క్రస్ రష్మిక మందన్నా పాన్ ఇండియా హీరోయిన్ గా మారి పోయింది. తను బన్నీతో కలిసి నటించిన పుష్ప2 మూవీ రికార్డుల మోత మోగించింది. వరల్డ్ వైడ్ గా రూ. 1800 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉంది ఈ ముద్దుగుమ్మ. చావా చిత్రం కూడా సక్సెస్ అవుతోందనే నమ్మకంతో ఉంది.
Also Read : Beauty Sai Pallavi-Chai Thandel :తండేల్ కళకళ కాసులు గలగల