Chari 111 First Look : టాలీవుడ్ లో పేరొందిన కమెడియన్లలో ఒకడు వెన్నెల కిషోర్. మనోడి కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఉండేలా జాగ్రత్త పడతాడు. తాజాగా స్పై జోనర్ లో వస్తున్న చిత్రం చారి 111. ఇందుకు సంబంధించి మూవీ మేకర్స్ ఉన్నట్టుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
Chari 111 First Look Viral
కమెడియన్ సీరియస్ పాత్ర చేస్తే ఎలా ఉంటుందో వెన్నెల కిషోర్(Vennela Kishore) ను చూస్తే తెలుస్తుంది. గతంలో చాలా చిత్రాలలో వినోద ప్రధానమైన పాత్రలలో నటించాడు మెప్పించాడు. కానీ ఈసారి దర్శకుడి ఆలోచనకు తగ్గట్టు కాస్తంత మెదడుకు మేథ పెట్టే పాత్రకు ప్రయారిటీ ఇచ్చాడు .
ఇది పూర్తిగా స్పై యాక్షన్ కామెడి డ్రామాతో కూడిన మూవీ కావడం విశేషం. ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆకట్టుకునే దానికంటే ఆలోచించ చేసేలా కడుపుబ్బా నవ్వుకునేలా ఉంది. ఇంటర్నేషనల్ ఏజెంట్ పాత్ర కావవడం, ఇందుకు తగ్గట్టే వెన్నెల కిషోర్ దానిలో లీనమై పోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
మరో వైపు మలయాళంకు చెందిన హీరోయిన్ సంయుక్తా విశ్వ నాథన్ వెన్నెల కిషోర్ తో కలిసి నటిస్తుండడం విశేషం.
Also Read : Pippa: Rajani VS Mrunal