Chandrika Gera Dixit: బిగ్ బాస్ లో అడుపెడుతున్న బ్యూటీఫుల్ ఫుడ్ వ్లాగర్ !

బిగ్ బాస్ లో అడుపెడుతున్న బ్యూటీఫుల్ ఫుడ్ వ్లాగర్ !

Chandrika Gera Dixit: ఇండియాలో బిగ్‌ బాస్ పై ఎంతటి వివాదాలు నడుస్తున్నా, ఎంత మంది విమర్శలు చేస్తున్నా కూడా పలు భాషల్లో ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే హిందీలో 17 సీజన్ లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్… ప్రస్తుతం ఓటీటీ సీజన్ 3 తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. శుక్రవారం నుంచి ప్రారంభం కాబోతున్న హిందీ బిగ్‌ బాస్ ఓటీటీ సీజన్‌ 3 లోని కంటెస్టెంట్స్ విషయంలో ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌ లో సెన్షేషన్‌ క్రియేట్‌ చేసిన ఫుడ్‌ వ్లాగర్‌ చంద్రిక గెరా దీక్షిత్‌(Chandrika Gera Dixit) కి బిగ్‌ బాస్ లో ఎంట్రీకి ఛాన్స్ లభించింది.

Chandrika Gera Dixit…

రెగ్యులర్‌ సీజన్స్ తో సమానంగా ఓటీటీకి కూడా హిందీ తో పాటు దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. అందుకే కంటెస్టెంట్స్ విషయంలో బిగ్ బాస్ ఓటీటీ నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుని ప్రముఖ సెలబ్రెటీలను, యూత్‌ లో మంచి ఫాలోయింగ్‌ ఉన్న వారిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హీరోయిన్‌ స్థాయి అందంను కలిగి ఉండే ఫుడ్ వ్లాగర్ చంద్రిక గెరా దీక్షిత్‌ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ ఫుడ్‌ వ్లాగ్‌ వీడియోలకు లక్షల్లో అభిమానులు ఉంటారు. ఆమె వీడియోలకు మిలియన్ ల వ్యూస్ రెగ్యులర్‌ గా ఉంటాయి. ఆమె చేసే వడా పావ్ కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. అందుకే ఆమెను వడ పావ్ గర్ల్‌ అని కూడా అంటారు. యూట్యూబ్‌ లో పాపులారిటీని సొంతం చేసుకున్న తర్వాత బిగ్‌ బాస్ లో ఎంట్రీ ఇచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అయితే కచ్చితంగా చంద్రిక గెరా మాత్రం చాలా స్పెషల్‌ గా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అంటూ బిగ్‌ బాస్ లవర్స్ మరియు ఆమె ఫాలోవర్స్ అంటున్నారు.

Also Read : Varun Tej: ల్యాంగ్ గ్యాప్ తరువాత షూటింగ్‌ కు వరుణ్ తేజ్ !

big bossChandrika Gera Dixit
Comments (0)
Add Comment