Chandramukhi 2 : వాసు దర్శకత్వం వహించిన చంద్రముఖి-2 చిత్రం ఊహించని విధంగా విడుదల వాయిదా పడింది. ఈ మూవీలో బాలీవుడ్ కు చెందిన కంగనా రనౌత్ , తమిళ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ నటించారు.
Chandramukhi 2 Updates
చంద్రముఖి సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తీశాడు. సాంకేతిక కారణాల వల్ల మూవీ విడుదల వాయిదా వేసినట్లు స్పష్టం చేశారు మూవీ మేకర్స్. ట్విట్టర్ వేదికగా ఇవాళ వెల్లడించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
పి. వాసు చంద్రముఖి-2(Chandramukhi 2)ను అద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. షూటింగ్ కూడా పూర్తి కావడంతో ఈనెల 15న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కానీ ఏమైందో ఏమో కానీ అప్ డేట్ ఇచ్చారు. ప్రకటించిన తేదీ కాకుండా వేరే డేట్ ను ఖరారు చేశామని తెలిపారు.
ఇదిలా ఉండగా చంద్రముఖి 2005లో విడుదలైంది. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ , జ్యోతిక జంటగా నటించారు. మానసికంగా ఇబ్బంది పడుతున్న పాత్రలో జ్యోతిక నటించగా తన ప్రాణాలను పణంగా పెట్టి కేసును ఛేదించాలని భావించే మనో రోగ వైద్యుడి చుట్టూ ఈ సినిమా రూపొందించారు.
Also Read : Shah Rukh Khan : జైలర్ సక్సెస్ ఊహించిందే