Chandramukhi2 : తమిళ సినీ దర్శకుడు వాసు దర్శకత్వం వహించిన చంద్రముఖి -2 చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదలైంది. సక్సెస్ అయిన చంద్రముఖికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తీశాడు. జ్యోతిక, రజనీకాంత్ నటించిన మూవీ అప్పట్లో భారీ కలెక్షన్స్ కొల్లగొట్టింది.
Chandramukhi2 Updates
తాజాగా సీక్వెల్ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల చేశారు మూవీ మేకర్స్. అందరినీ మరోసారి భయపెట్టేందుకు వస్తోంది. వాసు తనదైన శైలితో సినిమాను తెరకెక్కించారు. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందజేస్తున్నారు.
గతంలో వచ్చిన చంద్రముఖిలో జ్యోతిక కీలక పాత్ర పోషించింది. అద్భుతంగా నటించి మెప్పించింది. ఇక రజనీకాంత్ తన అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ఇక సీక్వెల్ లో జ్యోతికకు బదులు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ను తీసుకున్నారు. హీరోగా రాఘవ లారెన్స్ నటిస్తుండడం విశేషం.
ఇక చంద్రముఖి -2(Chandramukhi2) కు సంబంధించిన పోస్టర్స్ , టీజర్ ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కూడా మరింత అంచనాలను పెంచేలా చేశాయి. బంగ్లా..చంద్రముఖి గది..పాము..ఇలా ఉత్కంఠ రేపేలా తీర్చిదిద్దారు దర్శకుడు వాసు. స్టార్ కమెడియన్ వడివేలు తన హాస్యాన్ని పండించనున్నాడు. కీరవాణి మ్యూజిక్ చిత్రానికి అస్సెట్ కానుంది.
Also Read : Salaar Prabhas : సలార్ పై ఎడతెగని ఉత్కంఠ