Chandrabose: తెలుగు డాక్యుమెంటరీకు కేన్స్ పురస్కారం !

తెలుగు డాక్యుమెంటరీకు కేన్స్ పురస్కారం !

Chandrabose: తెలంగాణాలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చల్లగరిగ అనే కుగ్రామంలో జన్మించి గీత రచయితగా ఆస్కార్ అవార్డు అందుకున్నారు ప్రముఖ గీత రచయిత చంద్రబోస్. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలోని నాటు నాటు… పాటకిగానూ రచయిత చంద్రబోస్‌, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఆస్కార్‌ పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆస్కార్ అవార్డు అందుకుని తిరిగి స్వగ్రామం వెళ్ళినప్పుడు… చల్లగరిగ గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు చంద్రబోస్ కు ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో వారి సంబరాలు, భావోద్వేగాలు, విజేత జ్ఞాపకాల్ని… ‘ఆస్కార్‌ చల్లగరిగ’ పేరుతో డాక్యుమెంటరీగా తెరకెక్కించారు సుశీల్‌రావు.

Chandrabose Viral

అయితే ఈ ‘ఆస్కార్‌ చల్లగరిగ’ కు కేన్స్‌ వరల్డ్‌ ఫిలిం ఫెస్టివల్‌లో భారతీయ ఉత్తమ డాక్యుమెంటరీగా పురస్కారం లభించింది. దీనితో భారతదేశంలోని ఓ కుగ్రామంలో జరిగిన వేడుక ప్రపంచ దృష్టిని ఆకర్షించడం ఎంతో ఆనందాన్నిచ్చిందనీ, ఈ పురస్కారం చంద్రబోస్‌కే కాకుండా ఆయన గ్రామమైన చల్లగరిగకి దక్కిన నివాళిగా భావిస్తున్నానని సుశీల్‌రావు తెలిపారు.

Also Read : Rakul Preet Singh: మళ్లీ సౌత్ పై కన్నేసిన స్లిమ్ బ్యూటీ !

Chandraboserrr movie ss rajamouli 6 national awards
Comments (0)
Add Comment