Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయనతో పాటు తనయుడు నారా లోకేష్ సైతం విషెస్ తెలిపారు. శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు.
Pawan Kalyan Birthday Wishes Viral
ప్రజల మనిషిగా, సమాజ హితం కోరే నాయకుడిగా, శ్రేయాభిలాషిగా రాష్ట్ర హితం కోరుకునే మీకు ఆ దేవుడు నిండు నూరేళ్లు ఉండేలా చూడాలని కోరారు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ సోదరుడు ప్రముఖ నటుడు మెగా స్టార్ చిరంజీవి. మరో సోదరుడు నాగబాబు.
గతంలో ప్రజా రాజ్యంలో అన్నయ్యకు తోడుగా ఉన్నాడు. ఆ తర్వాత రాజకీయాలపై ఉన్న ఆసక్తితో జనసేన పార్టీని స్థాపించారు. గతంలో జరిగిన ఎన్నికల్లో పోటీలో నిలిచినా ఆశించిన మేర రాణించ లేక పోయారు. ప్రస్తుతం అధికారమే లక్ష్యంగా వారాహి విజయ యాత్ర చేపట్టారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ ముందుకు వెళుతున్నారు.
ఓ వైపు సినిమాలలో నటిస్తూనే మరో వైపు పాలిటిక్స్ లో బిజీగా గడుపుతున్నారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). ప్రధానంగా ఆయన ఏపీలో కొలువు తీరిన జగన్ సర్కార్ ను, ఆయన సహచర మంత్రులు, ఎమ్మెల్యేలను ఏకి పారేస్తున్నారు. తాను గెలిచినా లేదా గెలవక పోయినా పట్టించు కోనని, ప్రజల కోసం పని చేయడమే తన అంతిమ లక్ష్యమని ప్రకటించారు.
Also Read : Jailer Producer : జైలర్ దర్శకుడికి సూపర్ గిఫ్ట్