Chandrababu Naidu : చిరంజీవి క‌ల‌కాలం వ‌ర్దిల్లు

మెగాస్టార్ కు బాబు విసెష్

Chandrababu Naidu : మెగ‌స్టార్ చిరంజీవి బ‌ర్త్ డే ఇవాళ‌. ఆయ‌నకు సినీ, రాజ‌కీయ‌, క్రీడా , త‌దిత‌ర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ చీఫ్ ,మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా విసెష్ తెలిపారు.

Chandrababu Naidu Wishes to Mega Star

ఎవ‌రిపై ఆధార‌ప‌డ‌కుండా త‌న స్వ‌శ‌క్తితో క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చార‌ని కొనియాడారు. మీరు ఆయురారోగ్యాల‌తో అష్ట‌యిశ్వ‌ర్యాల‌తో ఉండాల‌ని కోరారు నారా చంద్ర‌బాబు నాయుడు(Chandrababu). ఇదిలా ఉండ‌గా చిరంజీవి స్వ‌స్థ‌లం ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా మొగ‌ల్తూరు.

ఇదిలా ఉండ‌గా చిరంజీవికి ఒక కొడుకు ఇద్ద‌రు కూతుళ్లు ఉన్నారు. కొడుకు ప్ర‌ముఖ న‌టుడు రామ్ చ‌ర‌ణ్. బావ ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్. ఇద్ద‌రు త‌మ్ముళ్లు ప్ర‌ముఖ న‌టులు నాగేంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్. 150కి పైగా సినిమాల‌లో న‌టించారు.

రాష్ట్ర‌, జాతీయ అవార్డులు పొందారు. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాషలలో న‌టించారు. ప్ర‌జా రాజ్యం పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. చివ‌ర‌కు ప‌వ‌ర్ లోకి రాక పోవ‌డంతో దానిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా ప‌ని చేశారు.

ప్ర‌స్తుతం కాంగ్రెస్ లో కొన‌సాగుతున్నా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్నారు. సినిమాల‌లో న‌టించ‌డంపైనే ఎక్కువ ఫోక‌స్ పెట్టారు మెగాస్టార్ చిరంజీవి.

Also Read : Gunturu Karam Movie : సంక్రాంతికి గుంటూరు కారం

Best WishesChandrababuMega StarTrending
Comments (0)
Add Comment