Chandra Mohan Tribute : తీర‌ని బంధం ఆ ముగ్గురిది

బాలు..విశ్వ‌నాథ్..చంద్ర‌మోహ‌న్

Chandra Mohan Tribute : తెలుగు సినిమా రంగంలో ముగ్గురూ ముగ్గురే. ఆ ముగ్గురు దిగ్గ‌జాలే. ఎవ‌రికి వారు ప్ర‌త్యేక‌త‌ను క‌లిగిన వారే. వారిలో చివ‌రి దాకా ఉన్న చంద్ర‌మోహ‌న్ శ‌నివారం ఇక సెల‌వంటూ వెళ్లి పోయారు. త‌ను ప్రాణ ప్ర‌దంగా ప్రేమించే ద‌ర్శ‌కుడు కే విశ్వ‌నాథ్, దిగ్గ‌జ గాయ‌కుడు ఎస్పీ బాల సుబ్ర‌మ‌ణ్యం వ‌ద్ద‌కు. ఈ ముగ్గురికి ఒక‌రంటే మ‌రొక‌రికి అభిమానం. అంత‌కు మించిన అనుబంధం కూడా.

Chandra Mohan Tribute from Celebraties

విచిత్రం ఏమిటంటే క‌రోనా ఎంద‌రినో బ‌లి తీసుకుంది. ఆ కాటుకు బ‌లై పోయాడు ఎస్పీబీ. యావ‌త్ దేశం త‌ల్ల‌డిల్లింది ఆ మ‌హా గాయ‌కుడి మ‌ర‌ణంతో. అంత‌కు మించి రోదించారు ఇద్ద‌రూ విశ్వ‌నాథ్, చంద్ర‌మోహ‌న్(Chandra Mohan). త‌మ‌ను ఎందుకు ముందు తీసుకు వెళ్ల‌లేదంటూ ఆ దేవుడిని నిందించారు. అంత‌లా అల్లుకు పోయారు.

ఆ త‌ర్వాత ఇక సెల‌వు తీసుకుంటున్నానంటూ కె. విశ్వ‌నాథ్ వెళ్లి పోయారు. దీనిని త‌ట్టుకోలేక పోయారు చంద్ర‌మోహ‌న్ . ఆయ‌న‌ను తండ్రి స‌మానంగా చూశాడు. ఎందుకంటే త‌ను జ‌య‌ప్ర‌ద‌తో తీసిన సిరి సిరి మువ్వ చిత్రం సినిమా రంగంలో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

ఇందులో వేటూరి పాట‌లు రాస్తే బాలు త‌న గొంతుతో మ్యాజిక్ చేశాడు. చంద్ర‌మోహ‌న్ విశ్వ‌నాథ్ లేక పోవ‌డాన్ని త‌ట్టుకోలేక పోయారు. మొత్తంగా చివ‌ర‌కు త‌ను కూడా వెళ్లి పోయాడు.

Also Read : Chandra Mohan : సాహితీ..సంగీత ప్రియుడు

Comments (0)
Add Comment