Chandra Mohan : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణమైన నటుడిగా గుర్తింపు పొందిన చంద్రమోహన్ కు అరుదైన గుర్తింపు కూడా ఉంది. అదేమిటంటే ఆయనకు లక్కీ హీరో అన్న పేరు. అత్యంత స్టార్ డమ్ కలిగిన హీరోయిన్లలో చాలా మంది తనతో నటించిన వారే. 1980 నుంచి 2000 దాకా నటించిన చాలా సినిమాలలో కీలక పాత్రలు పోషించిన వారే కావడం విశేషం.
Chandra Mohan Memories
చంద్రమోహన్ తో నటించి ఆకట్టుకున్న నటీమణులలో శ్రీదేవి, జయప్రద, జయసుధ, రాధిక, ప్రభ, విజయశాంతి, తదితరులు ఎందరో ఉన్నారు. కె. రాఘవేంద్ర రావు తీసిన పదహారేళ్ల వయసు మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో చంద్రమోహన్ నటన హైలెట్.
కె. విశ్వనాథ్ తీసిన సిరిసిరిమువ్వ మూవీలో జయప్రద తో కలిసి నటించాడు చంద్రమోహన్. ఇది మ్యూజికల్ హిట్. ఇక శుభ ప్రదం తో పాటు పలు హిట్ చిత్రాలలో తనదైన పాత్ర పోషించాడు. తెలుగులోనే కాదు తమిళంలో కూడా నటించారు. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.
తను చని పోయేంత వరకు ఏదో ఒక పాత్ర చేస్తూ ఉండి పోయాడు. 2000 నుండి 2023 దాకా పలు సినిమాలలో క్యారెక్టర్ పాత్రలలో మెప్పించాడు. ప్రత్యేకించి చంద్రమోహన్ తండ్రి పాత్రకు సరైన న్యాయం చేశాడు.
Also Read : Chandra Mohan Movies : చంద్రమోహన్ సినిమాలివే