Chandra Mohan : తెలుగు సినిమా రంగంలో దిగ్గజ నటుడు చంద్రమోహన్ ను కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు. విలక్షణ నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నాడని, ఆయన సినిమాల ద్వారా ఎందరినో ప్రభావితం చేశాడని ప్రశంసించారు.
Chandra Mohan Condolence from CM YS Jagan and KCR
ఆయన మరణం తమను ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రమోహన్(ChandraMohan) కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఏపీ , తెలంగాణ సీఎంలు జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్. ఎన్నో వైవిధ్య భరితమైన పాత్రలతో మెప్పించారంటూ ప్రశంసించారు టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్.
మెగాస్టర్ చిరంజీవి, మోహన్ బాబు, దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ చంద్రమోహన్ ను మహా నటుడిగా కీర్తించారు. ఎక్కడా భేషజాలు లేని అరుదైన నటుడు అని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా చంద్రమోహన్ తీవ్ర అనారోగ్యంతో ఇవాళ కన్ను మూశారు. ఆయనకు 83 ఏళ్లు. 938 సినిమాలలో నటించారు. 175 సినిమాలలో హీరోగా నటించి మెప్పించారు. ఆయనకు లక్కీ హీరో అన్న పేరు కూడా ఉంది. గతంలో స్టార్ హీరోయిన్లుగా ఉన్న వారంతా తనతో నటించిన వారే కావడం విశేషం.
Also Read : Chandra Mohan Tribute : తీరని బంధం ఆ ముగ్గురిది