Chandini: ప్రముఖ దక్షిణాది నటుడు ఉపేంద్ర నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘ఏ’. 1998లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో ఉపేంద్ర సరసన చాందిని(Chandini) హీరోయిన్‌గా నటించారు. ఉపేంద్ర స్టైల్ కు టాలీవుడ్ లో కూడా ఇప్పటికీ ఈ సినిమాకు గుర్తింపు ఉంది. అయితే ‘ఏ’ సినిమా విడుదలై పాతిక సంవత్సరాలు అవుతున్న సందర్భంగా… ఈ సినిమాను తాజాగా తెలుగులో రీ రిలీజ్ చేశారు. ఉప్పి క్రియేషన్స్, చందు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై ఈ చిత్రం తెలుగులో 4కేలో ఈ నెల 21న రీ రిలీజ్ అయింది. ఈ నేపంథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చాందిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
Chandini Comment
ఉపేంద్రతో నటించిన ‘ఏ’ సినిమా తన జీవితాన్నే మార్చేసిందని చాందిని(Chandini) తెలిపింది. తాను చదువుకుంటున్న రోజుల్లోనే ఈ మూవీ ఛాన్స్ దక్కినట్లు గుర్తుచేసుకుంది. ఈ పాత్ర కోసం చాలామంది పోటీపడ్డారని ఆమె తెలిపింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉండటంతో చాలామందిని ఆడిషన్స్ చేశారని చెప్పింది. కానీ తెలిసిన వారి నుంచి తన ఫోటోలు ‘ఏ’ సినిమా మేకర్స్ చేతికి వెళ్లాయని, ఆ సమయంలో తనను చూడకుండానే వారు సెలక్ట్ చేశారని తెలిపింది.
ఇదే సమయంలో తన పెళ్లి గురించి ఇలా చెప్పుకొచ్చింది. ‘వివాహ బంధంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నా పెళ్లి గురించి చాలామంది అడుగుతూ ఉంటారు. అది మన చేతుల్లో లేదు. దానిని దేవుడు నిర్ణయించాలి. పెళ్లి అనేది నేను అద్భుతమని అనుకుంటాను. నాకు తెలిసి ప్రేమతో ఉన్న అరెంజ్ మ్యారేజ్‌లు బాగుంటాయి.’ అని చాందిని తెలిపింది. అయితే నాలుగు పదుల వయసు దాటిన తరువాత కూడా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచలర్ గా కొనసాగుతున్న చాందిని… పెళ్లి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
Also Read : Love Mouli: ఓటీటీలోనికి నవదీప్ బోల్డ్ మూవీ ‘లవ్ మౌళి’ ! స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?