Music Shop Murthy OTT : ఓటీటీలో చాందిని చౌదరి నటించిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’

అలాగే శ్రీనివాస్ బెజుగం సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా...

Music Shop Murthy : తెలుగు హీరోయిన్ చాందినీ చౌదరి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. సీనియర్ యాక్టర్లు అజయ్ ఘోష్, ఆమని తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. పోస్టర్స్, టీజర్, ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో రిలీజ్ కు ముందే మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు అనుగుణంగానే జూన్ 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఎలాంటి అసభ్యకర డైలాగులు, సీన్స్ లేకుండా సాగే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడంతో కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి.

థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే మంగళవారం (జులై 16) అర్ధరాత్రి నుంచే మ్యూజిక్ షాప్ మూర్తి(Music Shop Murthy) సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది ఈటీవీ విన్ ఓటీటీ సంస్థ.

Music Shop Murthy OTT Updates

‘మ్యూజిక్ కి మోత మోగిపోద్ది.. పేరు గుర్తుందిగా.. మూర్తి.. మ్యూజిక్ షాప్ మూర్తి ఇప్పుడు ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది’ అని సినిమాకు సంబంధించిన ఒక ఫన్నీ క్లిప్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్. శివ పాలడుగు తెరకెక్కించిన మ్యూజిక్ షాప్ మూర్తి(Music Shop Murthy) సినిమాలో అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఫ్లై హై సినిమాస్ పతాకంపై హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించిన ఈ సినిమాకు పవన్ స్వరాలు సమకూర్చారు. అలాగే శ్రీనివాస్ బెజుగం సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. మరి థియేటర్లలో మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాను మిస్ అయ్యారా? అలాగే ఓ క్లీన్ అండ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీని చూడాలనుకుంటున్నారా?అయితే మీకు మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా ఒక మంచి ఛాయిస్.

Also Read : Malvi Malhotra : నటి మాల్వి మల్హోత్రా పై కత్తితో హత్యాయత్నం

ChandiniMusic Shop MurthyTrendingUpdatesViral
Comments (0)
Add Comment