Champions Trophy : పాకిస్తాన్ – ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) 2025లో భాగంగా పాకిస్తాన్ లోని లాహోర్ గడాఫీ స్టేడియంలో జరిగిన రెండో సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆ జట్టు 362 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా చుక్కలు చూపించింది. చివరి దాకా ఒంటరి పోరాటం చేశాడు సఫారీ ఆటగాడు డేవిడ్ మిల్లర్ . సెంచరీతో కదం తొక్కాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. కేవలం 312 పరుగులకు మాత్రమే పరిమితమైంది. దీంతో 50 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది కీవీస్.
Champions Trophy NZ vs SA Match Updates
భారత జట్టుతో దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమైంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే దక్షిణాఫ్రికా జట్టులో రబాడా 16, రికెల్టన్ 17, క్లాసెన్ 3 , డస్సెన్ 69 , కెప్టెన్ బావుమా 56 రన్స్ చేశాడు. వీరిందరినీ మిచెల్ సాంట్నర్ పెవిలియన్ కు పంపించాడు. కేశవ మహారాజ్ ఒక పరుగు చేస్తే మార్కో జాన్ సెన్ 3 , గ్లెన్ ఫిలిప్స్ , వేన్ ముల్లర్ 8 , ఐడెన్ మార్క్రామ్ 31 రన్స్ చేసి రచిన్ రవీంద్ర బౌలింగ్ లో వెనుదిరిగారు.
కీవీస్ స్కిప్పర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 6 వికెట్లు కోల్పోయి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది. క్రికెట్ వన్డే చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేసం. రచిన్ రవీంద్ర 108 రన్స్ చేస్తే, కేన్ విలియమ్సన్ 102 పరుగులతో రెచ్చి పోయారు. మిచెల్, ఫిలిప్స్ చెరో 49 రన్స్ చేశారు. ఎంగిడి 3 వికెట్లు తీస్తే రబాడా 2 వికెట్లు పడగొట్టాడు.
Also Read : Ram Gopal Varma Shocking :రామ్ గోపాల్ వర్మకు సీఐడీ నోటీసులు