Champions Trophy : దుబాయ్ – ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy)లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు సత్తా చాటింది. 4 వికెట్ల తేడాతో ఆసిస్ ను మట్టి కరిపించింది. టోర్నీ ఫైనల్ కు చేరుకుంది. 2023 ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. దీనికి ప్రతీకారం తీర్చుకుంది.
India Enters Champions Trophy 2025 Finals
ప్రత్యర్థి జట్టు కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు ముందు 264 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం మైదానంలోకి దిగిన టీమిండియా 48.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 6 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది.
దాయాది పాకిస్తాన్ తో జరిగిన కీలక పోరులో సెంచరీతో దుమ్ము రేపిన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరోసారి సత్తా చాటాడు. ఆస్ట్రేలియా పాలిట శాపంగా మారాడు. 42 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సమయంలో శ్రేయస్ అయ్యర్ తో కలిసి మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పాడు.
విరాట్ కోహ్లీ 84 రన్స్ చేయగా శ్రేయస్ అయ్యర్ 45 రన్స్, కేఎల్ రాహుల్ 42 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. హార్దిక్ పాండ్యా 28 పరుగులు ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించారు. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు తీయగా వరుణ్, జడేజా రెండు వికెట్లు తీశారు. ఆసిస్ జట్టులో స్టీవ్ స్మిత్ 73 రన్స్ చేశాడు.
Also Read : Singer Kalpana Suicide Sensational :సింగర్ కల్పన ఆత్మహత్యా యత్నం