Champions Trophy Semi Final :భార‌త్ సిద్దం ఆసిస్ స‌న్న‌ద్దం

నేడే దుబాయ్ వేదిక‌గా సెమీస్

Champions Trophy : దుబాయ్ – ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025(Champions Trophy) ఆఖ‌రి అంకానికి చేరింది. ఇవాళ కీల‌క‌మైన సెమీ ఫైన‌ల్ మ్యాచ్ కు దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియం వేదిక కానుంది. ఇప్ప‌టికే భార‌త్ బ‌ల‌మైన కీవీస్, పాకిస్తాన్ జ‌ట్ల‌ను మ‌ట్టి క‌రిపించింది. త‌న‌కు ఎదురే లేద‌ని చాటింది.

Champions Trophy Semi Final

రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోని టీమిండియా అన్ని విభాగాల‌లో బ‌లంగా ఉంది. ప్ర‌ధానంగా ఇండియ‌న్ ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ సూప‌ర్ ఫామ్ తో ఉండ‌డం జ‌ట్టుకు క‌లిసి వ‌చ్చే అంశం. ఇంకో వైపు భార‌త బౌల‌ర్లు వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, హార్దిక్ పాండ్యా, మొహమ్మ‌ద్ ష‌మీ దుమ్ము రేపుతున్నాయి. ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు క‌ళ్లు చెదిరే బంతుల‌తో చుక్క‌లు చూపిస్తున్నారు. దీంతో ప‌రుగులు తీసేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు.

మ‌రో వైపు భార‌త జ‌ట్టు ప్ర‌తీకారం తీర్చు కోవాల‌ని క‌సితో ఉంది. 2023లో జ‌రిగిన ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓట‌మి పాలైంది. ప్ర‌స్తుతం సెమీస్ మ్యాచ్ లో ఆ జ‌ట్టుకు కోలుకోలేని రీతిలో షాక్ ఇవ్వాల‌ని అనుకుంటోంది. ఈ మేర‌కు అస్త్ర శ‌స్త్రాల‌ను సిద్దం చేసుకుంటోంది.

ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఆతిథ్య జ‌ట్టు పాకిస్తాన్ భార‌త జ‌ట్టు చేతిలో ఘోరంగా ఓట‌మి పాలైంది. ఏ ఒక్క మ్యాచ్ గెల‌వ‌కుండానే టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. ఇవాళ జ‌రిగే మ్యాచ్ ను కోట్లాది మంది వీక్షించ‌నున్నారు.

Also Read : Beauty Kayadu Lohar :మూవీ ఛాన్స్ కొట్టేసిన డ్రాగ‌న్ బ్యూటీ

Champions TrophyCricketSemi FinalTrendingUpdates
Comments (0)
Add Comment