Champions Trophy 2025 Final :విశ్వ విజేత టీమిండియా

4 వికెట్ల తేడాతో కీవీస్ పై గెలుపు

Champions Trophy : దుబాయ్ – ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ(Champions Trophy) 2025 విజేత‌గా నిలిచింది రోహిత్ సేన . దుబాయ్ లోని ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియం వేదిక‌గా ఆదివారం జ‌రిగిన ఉత్కంఠ భ‌రిత పోరులో న్యూజిలాండ్ ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 251 ప‌రుగులు చేసింది. అనంత‌రం 252 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగింది భార‌త జ‌ట్టు.

Champions Trophy 2025 Won India

49 ఓవ‌ర్ల‌లో పూర్తి ల‌క్ష్యాన్ని ఛేదించింది. ఇదిలా ఉండ‌గా గ‌త 9 నెల‌ల కాలంలో రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలోని టీమిండియాకు వ‌రుస‌గా ఇది రెండో ఐసీసీ టైటిల్ చేజిక్కించు కోవ‌డం విశేషం. గత ఏడాది 2024లో జ‌రిగిన ఐసీసీ టి20 టోర్నీలో కూడా విజేత‌గా నిలిచింది భార‌త జ‌ట్టు. త‌న‌కు ఎదురే లేద‌ని చాటింది.

ఇక టీమిండియా విష‌యానికి వ‌స్తే అక్ష‌ర్ ప‌టేల్ 29 ర‌న్స్ చేయ‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్ మ‌రోసారి రాణించాడు. 48 కీల‌క ర‌న్స్ చేశాడు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అద్భుతంగా ఆడాడు. 76 ర‌న్స్ చేసి స్కోర్ ను పెంచే ప్ర‌య‌త్నం చేశాడు. త‌న‌కు తోడుగా శుభ్ మ‌న్ గిల్ స‌హ‌క‌రించాడు. 31 ప‌రుగులు చేసి అవుట్ అయ్యాడు. వీరిద్ద‌రూ క‌లిసి 105 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. కాగా సెంచ‌రీల‌తో టోర్నీలో క‌దం తొక్కిన విరాట్ కోహ్లీ నిరాశ ప‌రిచాడు. కేవ‌లం ఒకే ఒక్క ప‌రుగు చేశాడు. చివ‌ర‌కు కేఎల్ రాహుల్ , జ‌డేజా ప‌ని కానిచ్చేశారు.

Also Read : Garimella Balakrishna Prasad Death :మూగ బోయిన స్వ‌రం దివికేగిన గానం

2025Champions TrophyIND vs NZIndiaTrendingUpdatesWon
Comments (0)
Add Comment