Prabuthwa Junior Kalashala : చల్ల గాలి సాంగ్ ను రిలీజ్ చేసిన ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ టీమ్

ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా అప్డేట్స్

Prabuthwa Junior Kalashala : ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ పుంగనూరు-500143 బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరించబడిన ఇంటర్మీడియట్ లవ్ స్టోరీ మూవీ. ఈ సినిమాలో ప్రణవ్, షజ్ఞాశ్రీ జంటగా నటించగా.. శ్రీనాథ్ పులకురామ్ దర్శకత్వం వహించారు. కొవ్వూరి అరుణ సమర్పణలో కొవ్వూరి భువన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని రెండో పాటచల్ల గాలి అనే రొమాంటిక్ సాంగ్ ను వీడియో సాంగ్ మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటి వరకు లిరికల్ సాంగ్స్ విడుదల కాగా, తొలిసారిగా సినిమా విడుదలకు ముందు వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ జర్నలిస్టు ప్రభు హాజరయ్యారు.

Prabuthwa Junior Kalashala Movie Updates

2000 బ్యాక్ డ్రాప్ కు తగ్గట్టుగా సినిమాను తెరకెక్కించారని , విజువల్స్ చాలా బాగున్నాయని ప్రభు తెలిపారు. మంచి సినిమాకి, మంచి కంటెంట్‌కి మీడియా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని అన్నారు. డైరెక్టర్ శ్రీనాథ్(Srinath Pulakuram) పులకురామ్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో ప్రైవేట్ కాలేజీలే కాకుండా ప్రభుత్వ జూనియర్ కాలేజీ అనే పదం చాలా అరుదుగా వినిపిస్తుందన్నారు. 2000 నాటి నేపథ్యంలో పుంగనూరు గ్రామంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. మంచి బ్యానర్‌తో మంచి బడ్జెట్‌తో మంచి సినిమా తీశారు. ప్రేక్షకులు, మీడియా తమ సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. నిర్మాత భువన్‌రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ మంచి కాన్సెప్ట్‌తో సరికొత్త కథాంశంతో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామన్నారు.

దర్శకుడు శ్రీనాథ్ తనపై నమ్మకం ఉంచి ఈ కథకు తనను ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉందని హీరో ప్రణవ్ అన్నారు. షార్ట్ ఫిలిమ్స్ తోనే నటుడిగా మారానని భావించి హీరోగా నిలబెట్టారని అన్నారు. కథ చాలా కొత్తగా ఉంటుంది.. రెండు దశాబ్దాల వెనక్కి వెళ్లి రియలిస్టిక్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. హీరోయిన్ షజ్ఞాశ్రీ మాట్లాడుతూ.. ఈ సినిమాకి తనను ఎంపిక చేసినందుకు దర్శకుడు శ్రీనాథ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు విడుదలైన పాటల విజువల్స్ చాలా బాగున్నాయి. టేకింగ్, కాంప్రమైజ్ కాకుండా ఈ పాటను, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని నిర్మాత తెలిపారు. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటర్ గా పనిచేశారు. కార్తీక్ రోడ్రిగ్స్ సంగీతం, కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

Also Read : #90’s Web Series : మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో వస్తున్న బిగ్ బాస్ శివాజీ

BreakingMoviesTrendingUpdatesViral
Comments (0)
Add Comment