Suriya 44: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న సినిమా ‘సూర్య 44’ (వర్కింగ్ టైటిల్). ప్రస్తుతం సిరుతై శివ దర్శకత్వంలో ‘కంగువ’ సినిమాలో నటిస్తున్న సూర్య… ఆ తరువాత ‘ఆకాశం నీ హద్దు రా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సుధ కొంగర దర్శకత్వంలో ‘సూర్య 43’ లో నటించడానికి సూర్య(Surya) గ్రీన్ సిగ్నల్ ఇచ్చా డు. ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే… ‘సూర్య 44’ సినిమాను ‘పిజ్జా, పేటా, జిగర్ తండా, జిగర్ తండా డబుల్ ఎక్స్’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేయడానికి పచ్చ జెండా ఊపాడు.
ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్… ‘లవ్… లాఫ్టర్… వార్…’ అని ఉన్న పోస్టర్ ని తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. సూర్య(Suriya) సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కార్తీక్ సుబ్బరాజు స్టోన్ బెంచ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.
Suriya 44 Movie Updates
అయితే ‘సూర్య 44’లో నటించేందుకు నటీనటుల ఎంపిక చేపట్టారు చిత్ర యూనిట్. ఇందుకోసం ఆసక్తిగల నటీనటుల కోసం కాస్టింగ్ కాల్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కాస్టింగ్ కాల్ కు భాషతో సంబంధం లేకుండా ఎనిమిదేళ్ళ నుంచి 80 యేళ్ళ వయస్సున్న స్త్రీపురుషులు దరఖాస్తు చేసుకోవచ్చని చిత్రబృందం వెల్లడించింది. అలాగే, ఒకటి నుంచి మూడు నిమిషాల నిడివి కలిగిన వీడియో కూడా పంపించాలని పేర్కొంది. దీనితో సూర్య సినిమాలో అవకాశం కోసం వర్ధమాన నటులతో సాటు సీనియర్లు, చైల్డ్ ఆర్టిస్ట్ లు కూడా కాస్టింగ్ కాల్ ను సంప్రదిస్తున్నారు. అయితే సూర్యతో నటించే అవకాశం ఎంతమంది దక్కించుకుంటారో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికార ప్రకటన వెల్లడించే వరకు వేచిచూడాల్సిందే.
Also Read : Kubera: ముంబైలో ‘కుబేర’ షూటింగ్ !