Captain Miller: 15 రోజులకే ఓటీటీలోకి ధనుష్ సినిమా ! స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే ?

15 రోజులకే ఓటీటీలోకి ధనుష్ సినిమా ! స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే ?

Captain Miller: సత్య జ్యోతి ఫిలిమ్స్ పతాకంపై అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ప్రియాంక అరుల్ మోహన్, శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన సినిమా ‘కెప్టెన్‌ మిల్లర్‌’. 1930-40ల మధ్య కాలంలో జరిగిన ఆసక్తికర కథాంశంతో యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా తమిళనాట విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల కొరత వలన ఆ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది.

అయితే ఈ సినిమా తమిళంలో విడుదలై నెల రోజులు, తెలుగులో విడుదలై 15 రోజులు కాకముందే ఇప్పుడు ఓటీటీలోకి అడుగు పెడుతోంది. ఇదే విషయాన్ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్‌ వీడియో ప్రకటించింది. ఫిబ్రవరి 9 నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ‘కెప్టెన్‌ మిల్లర్‌(Captain Miller)’ స్ట్రీమింగ్ కు ఉంచనున్నట్లు తన అధికారిక సోషల్ మీడియా ద్వారా అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. దీనితో ‘కెప్టెన్‌ మిల్లర్‌’ సినిమాను థియేటర్లలో మిస్ అయిన అభిమానులు ఫిబ్రవరి 9 కోసం ఎదురుచూస్తున్నారు.

Captain Miller – ‘కెప్టెన్‌ మిల్లర్‌’ కథేమిటంటే ?

దేశంలో స్వాతంత్య్రోద్యమం కొన‌సాగుతున్న 1930 ద‌శ‌కంలో శివ‌న్న (శివ‌రాజ్‌ కుమార్‌) స్వ‌రాజ్యం కోసం పోరాటం చేస్తుంటే… అత‌ని తమ్ముడు అగ్నీశ్వ‌ర అలియాస్ అగ్ని (ధ‌నుష్‌) బ్రిటిష్ సైన్యంలో చేరాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. అందుకు కారణం… ఊరిలో కుల వివ‌క్ష‌తో అవ‌మానాలు ఎదుర్కోవ‌డ‌మే. సైన్యంలో చేరాక అగ్నికి బ్రిటిష‌ర్లు ‘కెప్టెన్ మిల్లర్’ అని పేరు పెడతారు. శిక్ష‌ణ పూర్త‌యిన వెంట‌నే జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌తో అత‌డి ప్ర‌యాణం మ‌లుపు తిరుగుతుంది. తన పై అధికారిని చంపేసి అక్క‌డి నుంచి త‌ప్పించుకుని వెళ్లిపోతాడు.

అందుకు తోటి సైనికుడు అయిన రఫీక్ (సందీప్ కిషన్) సాయం చేస్తాడు. బ్రిటిష్ సైన్యం నుంచి బ‌య‌టికొచ్చాక అగ్ని ఓ దొంగ‌గా మార‌తాడు. త‌న ఊళ్లో ఉన్న చారిత్రాత్మ‌క ఆల‌యంలో విగ్ర‌హాన్ని చోరీ చేస్తాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది ? ఆ విగ్ర‌హాన్ని అగ్నీశ్వ‌ర దొంగ‌త‌నం చేయ‌డానికి కార‌ణమేంటి ? ఊరిపై దండెత్తిన బ్రిటిష్ సైన్యంపై అగ్ని ఎలా పోరాటం సాగించాడ‌నే అంశాలతో దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ చాలా ఆశక్తికరంగా సినిమాను తెరకెక్కించారు.

Also Read : Rakul Preet Singh : పెళ్లి పీటలేక్కబోతున్న రకుల్…ఆ రాకుమారుడు ఎవరో తెలుసా

Captain Millerdanush
Comments (0)
Add Comment