Bunny Vas : నిర్మాతల్లో ఐక్యత ముఖ్యం అంటున్న బన్నీ వాస్

అంతేకాదు థియేటర్‌లకు ఆశించిన స్థాయిలో రావకపోవడానికి కారణాలన్ని ఆయన చెప్పారు...

Bunny Vas : ప్రేక్షకులను థియేటర్‌కు రాకుండా తామే చెడగొట్టామని అగ్ర నిర్మాత దిల్‌రాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై నిర్మాత బన్ని వాస్‌(Bunny Vas) స్పందించారు. ‘ ఆయ్‌’ మూవీ ఫన్‌ ఫెస్టివల్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులను గురించి చెప్పారు. ‘ మీరు ఇంట్లో కూర్చోండి నాలుగు వారాలకే సినిమాను ఓటీటీ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తాం’ అని దిల్‌రాజు అన్నారు దీనిపై మీరేమంటారు అన్న ప్రశ్నకు ‘‘ఎవరెన్ని బాధలు పడినా, ఏం చేసినా చిత్ర పరిశ్రమలో యూనిటీ లేకపోతే ఏమీ చేయలేం. ఛాంబర్‌, ఇంకెవరైనా రూల్స్‌ పెడితే, ఇది సక్సెస్‌ అయ్యేది కాదు. ఎగ్జిబిటర్స్‌, ప్రొడ్యూసర్స్‌ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. 8 వారాల కన్నా ముందే సినిమా ఓటీటీలో విడుదల చేస్తే థియేటర్లు ఇవ్వమని బాలీవుడ్‌ తీసుకున్న కఠిన నిర్ణయాలను ఇక్కడా కూడా అమలు చేయాలి. అప్పుడే ఈ వ్యవస్థ దార్లోకి వస్తుంది’’ అని అన్నారు.

Bunny Vas Comment

అంతేకాదు థియేటర్‌లకు ఆశించిన స్థాయిలో రావకపోవడానికి కారణాలన్ని ఆయన చెప్పారు. ‘‘ థియేటర్‌కు జనం రావాలంటే, ఏదైనా సందర్భం ఉండాలి. మహేశ్‌బాబు పుట్టినరోజు ఉంది కాబట్టే ‘మురారి’కి మంచి ఆదరణ వచ్చింది. ఒక మూడ్‌ క్రియేట్‌ అయితే తప్ప ప్రేక్షకులు రారు. ‘ ఆయ్‌’ మూవీకి ్ఘభారీగా పబ్లిసిటీ చేసి, సాధారణ రోజుల్లో విడుదల చేస్తే 20-25 శాతం ఓపెనింగ్‌ వస్తుంది. ఇప్పుడు వరుస సెలవులు వచ్చాయి కాబట్టి, 42 నుంచి 45 ఓపెనింగ్‌ అయింది. అలా కాకుండా మౌత్‌ టాక్‌తో వెళ్తే మూడో వారానికి అందుకుంటుంది. అందులో నాకు 35శాతం, మల్టీప్లెక్స్‌ వాళ్లకు 65శాతం వెళ్లుంది. గ్రాస్‌ కనపడుతుంది తప్ప, షేర్‌ కనపడదు. ఇది వరకు ఉన్నట్లు థియేటర్లలో పరిస్థితులు అనుకూలంగా లేవు’’ అని అన్నారు.

Also Read : Rhea Chakraborty : తన ప్రియుడితో ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్న రియా చక్రవర్తి

bunny VasCommentsProducerViral
Comments (0)
Add Comment