Pushpa 2 Success : పుష్ప‌2 విజ‌యం అభిమానుల‌కు అంకితం

ఇండియ‌న్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Pushpa 2 : ఇండియ‌న్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న సినీ కెరీర్ లో అద్భుత విజ‌యం పుష్ప 2(Pushpa 2 ) అందించింద‌న్నాడు. డైన‌మిక్ డైరెక్ట‌ర్ సుకుమార్ ను ఎప్ప‌టికీ మ‌రిచి పోలేన‌ని అన్నాడు. ఆనాడు ఆర్య త‌న‌ను ల‌వ‌ర్ బాయ్ గా చిత్రీక‌రించాడ‌ని, ఆ త‌ర్వాత ఎన్నో సినిమాలలో భిన్న‌మైన పాత్ర‌ల‌లో న‌టిస్తూ వ‌చ్చాన‌ని చెప్పాడు.

Pushpa 2 Updates

అన్ని సినిమాలు ఒక ఎత్తు పుష్ప మూవీ మ‌రో ఎత్తు అన్నాడు. ఇది ఊహించ‌ని స‌క్సెస్ సాధించాడ‌న్నాడు. పుష్ప 2 మూవీ రికార్డు స్థాయిలో రూ. 2 వేల కోట్ల‌కు పైగా వ‌సూలు సాధించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌నాద‌ర‌ణ పొందింది. ఈ సంద‌ర్బంగా మైత్రీ మూవీ మేక‌ర్స్ కు కూడా ధ‌న్య‌వాదాలు తెలిపారు అల్లు అర్జున్.

ప్ర‌తి సినిమా ప్ర‌త్యేకంగా ఉండేలా చూస్తున్నాన‌ని అన్నాడు. పుష్ప‌2 చిత్రం గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నాడు. బిగ్గెస్ట్ విజ‌యం సాధించేందుకు ప్ర‌ధాన కార‌కులైన అభిమానుల‌కు జీవితం రుణ‌ప‌డి ఉంటాన‌ని అన్నాడు. అందుకే పుష్ప‌2 చిత్రాన్ని ఫ్యాన్స్ కు అంకితం చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించాడు అల్లు అర్జున్.

ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం పుష్ప 3 సీక్వెల్ మూవీ ఉంటుందా అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌కుండా దాట‌వేశాడు. ప్ర‌స్తుతం త‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో సినిమా చేయ‌బోతున్నాడ‌ని టాక్.

Also Read : Beauty Swasika Movie :శంభాల వ‌సంత ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అదుర్స్

Pushpa 2TrendingUpdates
Comments (0)
Add Comment