Bunny : సుకుమార్ పుష్ప2 భారీ విజయం తర్వాత వస్తున్న తదుపరి చిత్రం అంచనాలు మరింత పెంచేలా చేసింది. ఇండియన్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్(Atlee) దర్శకత్వంలో ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Bunny) తో తీయబోయే ఇంటర్నేషనల్ మూవీ గురించి కన్ ఫర్మ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు. దీనిని తమిళ సినీ రంగానికి చెందిన భారీ నిర్మాణ సంస్థ సన్ ఇంటర్నేషనల్ నిర్మించనుంది. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున రెమ్యూనరేషన్ ఇవ్వనుంది.
Bunny – Atlee New International Movie
ఇందులో భారీ తారగణం కూడా ఉండనుందని టాక్. తాజాగా విడుదల చేసిన వీడియో దుమ్ము రేపుతోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఫోటోస్ హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో అట్లీ కుమార్, అల్లు అర్జున్ సంభాషిస్తున్న దృశ్యాలు మరింత ఉత్సుకతను కల్పించేలా చేసింది. సుకుమార్ పుష్ప రికార్డుల మోత మోగించింది. ఇది ఏకంగా రూ. 1867 కోట్లు వసూలు చేసింది. ఇదే సమయంలో అట్లీ కుమార్ గత ఏడాది బాద్ షా షారుక్ ఖాన్ , నయనతార, విజయ్ సేతుపతితో కలిపి జవాన్ తీశాడు. ఇది రూ. 1000 కోట్లు వసూలు చేసింది.
దీపికాతో కలిసి చేసిన పఠాన్ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక పుష్ప మూవీతో ఇండియా, ఇంటర్నేషనల్ లెవల్లో సూపర్ స్టార్ ఇమేజ్ పెంచేలా చేసింది అల్లు అర్జున్ కు. ఇదిలా ఉండగా సినీ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు బన్నీకి , అట్లీకి నిర్మాణ సంస్థ పెద్ద ఎత్తున రెమ్యూనరేషన్ చెల్లించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అమెరికా లోని లాస్ ఏంజెల్స్ లోని ఓ స్టూడియోలో చిత్రీకరించిన వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.
Also Read : Hero Yash-Nayanthara :యశ్ తో జత కట్టిన లేడీ అమితాబ్