Brahmastra: బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ బీర్ కపూర్, అలియాభట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ ‘బ్రహ్మాస్త్ర(Brahmastra): పార్ట్-1 శివ’. 2022లో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ నే తెచ్చుకుంది. ముఖ్యంగా విజువల్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ప్రీతమ్ అందించిన సంగీతం శ్రోతలను ఎంతగానో అలరించింది. ‘కేసరియా’ సాంగ్ యువ హృదయాలను అమితంగా రంజింపజేసింది. ఇప్పుడు ఈ సాంగ్ మ్యూజిక్ స్ట్రీమింగ్ వేదిక స్పాటిఫైలో రికార్డులు బద్దలు కొట్టింది. ఆ ఫ్లాట్ ఫాం వేదికగా 500 మిలియన్ స్ట్రీమింగ్స్ దాటిన తొలి పాటగా రికార్డు సృష్టించింది. సోనీ మ్యూజిక్ ఇండియా ఈ విషయాన్ని తెలియజేస్తూ సంతోషం వ్యక్తంచేసింది. అమిత్ భట్టాచార్య సాహిత్యం అందించిన పాటను అర్జిత్ సింగ్ ఆలపించారు. ఇక యూట్యూబ్ వేదికగా ఈ సాంగ్ అత్యధిక వ్యూస్‌తో అలరిస్తోంది. ఇప్పటివరకూ దాదాపు 76 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది.
Brahmastra – వచ్చే ఏడాది ‘బ్రహ్మాస్త్ర: పార్ట్-2′ పనులు ప్రారంభం ?
దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్రస్తుతం ‘వార్ 2’ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కీలక పాత్రల్లో ఈ మూవీ రూపొందుతోంది. దీనితో ‘బ్రహ్మాస్త్ర పార్ట్-2 దేవ్’ మరింత ఆలస్యం కానుందంటూ వార్తలు వచ్చాయి. ఆదిత్య చోప్రా కోరిక మేరకు ‘పార్ట్2’కు కాస్త విరామం ఇచ్చి ‘వార్2’కు దర్శకత్వం వహించేందుకు అయాన్‌ముఖర్జీ ఆసక్తి చూపారని, ఈ విషయంలో కరణ్ జోహార్ కూడా అభ్యంతరం చెప్పలేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది నవంబర్ చివరికి ‘వార్2’ పూర్తవుతుంది. ఆ తర్వాత కాస్త విరామం తీసుకుని జనవరి 2025 నుంచి బ్రహ్మాస్త్ర 2 మొదలుపెట్టనున్నారు. 2026 ప్రథమార్ధంలో మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read : Amala Paul: భర్తపై అమలాపాల్ భావోద్వేగంతో కూడిన పోస్ట్ !