Brahmanandam Popular : బ్రహ్మానందం ఇన్ స్టాగ్రామ్ లో సంచ‌ల‌నం

చేరిన క్ష‌ణాల్లోనే ల‌క్ష‌ల్లో వ్యూస్ తో రికార్డ్

Brahmanandam : తెలుగు సినీ రంగంలో అత్యంత పాపుల‌ర్ న‌టుడు బ్ర‌హ్మానందం(Brahmanandam). ఏ క‌మెడియ‌న్ కు రాని స్టార్ డ‌మ్ త‌న‌కు ల‌భించింది. ఇత‌ర క‌మెడియ‌న్ల కంటే టాప్ లో కొన‌సాగుతున్నారు. భిన్న‌మైన పాత్ర‌ల‌కు పెట్టింది పేరు. ఏ పాత్ర ఇచ్చినా దానికి వంద శాతం న్యాయం చేకూరుస్తాడు. ఇటీవ‌లే త‌న కొడుకుతో క‌లిసి తాత పాత్ర‌లో న‌టించాడు. ఇక కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రంగ‌మార్తాండ మూవీలో ప్రేక్ష‌కుల‌ను ఇంత దాకా న‌వ్వించిన ఆయ‌న క‌న్నీళ్లు పెట్టించాడు. త‌న‌లో కామెడీనే కాదు ఏడ్పించే గుణం కూడా ఒక‌టి ఉంద‌ని తెలియ చేశాడు.

Brahmanandam Popular At..

చిన్న‌ప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, అనేక ఆటుపోట్ల‌ను త‌ట్టుకుని జంధ్యాల పుణ్య‌మా అని సినిమా రంగంలోకి ఎంట‌ర్ అయ్యాడు. వ‌చ్చీ రావ‌డంతోనే క‌డుపుబ్బా న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు. ఇంటిల్లిపాదిని న‌వ్వుల‌తో ముంచెత్తాడు. బ్ర‌హ్మానందం వ‌ర‌ల్డ్ గ‌న్నిస్ బుక్ లో రికార్డు సంపాదించాడు. జాతీయ అవార్డుల‌ను పొందాడు. ల‌క్ష‌లాది మందిని త‌న అభిమానుల‌ను చేసుకున్నాడు.

త‌ను వ‌క్త‌, న‌టుడు, ప్ర‌యోక్త‌, శిల్పి..అంతే కాదు త‌న అభిప్రాయాల‌ను కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పేస్తాడు. పైస‌ల విష‌యంలో పొదుపుగా ఉంటాడు. షూటింగ్ లో నిక్క‌చ్చిగా ఉంటూ ..అయి పోయాక ఇంటికి వెళ్లి పోతాడు. కుటుంబంతో గ‌డుపుతాడు. పుస్త‌కాల‌తో కుస్తీ ప‌డ‌తాడు. పెయింటింగ్స్ తో కాల‌క్షేపం చేస్తాడు బ్ర‌హ్మానందం. తాజాగా త‌ను సోషల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ లో చేరాడు. నిమిషాల్లోనే లక్ష‌ల్లో వ్యూస్ వ‌చ్చాయి. పెద్ద ఎత్తున త‌న‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

Also Read : Hero Ram Charan :ప్రేమికులకు ‘ఆరెంజ్’ గిఫ్ట్

BrahmanandamInsta PostTrendingViral
Comments (0)
Add Comment