Brahmanandam Shocking : నా వార‌సుడు వెన్నెల కిషోర్ – బ్ర‌హ్మి

బ్ర‌హ్మానందం సంచ‌ల‌న కామెంట్స్

Brahmanandam : హైద‌రాబాద్ – ప్ర‌ముఖ కమెడియ‌న్ బ్ర‌హ్మానందం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అసాధార‌ణ‌మైన ప్ర‌తిభా నైపుణ్యం క‌లిగిన బ్ర‌హ్మి(Brahmanandam) ఉన్న‌ట్టుండి మ‌రో హాస్య న‌టుడు వెన్నెల కిషోర్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించారు. త‌ను ఈ మ‌ధ్య బాగా న‌టిస్తున్నాడ‌ని కితాబు ఇచ్చారు.

Brahmanandam Shocking Comments

ఈ మ‌ధ్య త‌ను ఎందుకు క‌నిపించ‌డం లేదంటూ ఆరా తీస్తున్నార‌ని, కానీ త‌న క్యారెక్ట‌ర్ కు త‌గ్గ పాత్ర‌లు రావ‌డం లేద‌న్నాడు. జీవితం ఉన్నంత వ‌ర‌కు న‌టిస్తూనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు బ్ర‌హ్మానందం. కామెడీ ప‌రంగా ఎవ‌రు త‌న వార‌సుడు అనే ప్ర‌శ్న‌కు ఠ‌కీమ‌ని స‌మాధానం ఇచ్చారు. ఇంకెవ‌రు..వెన్నెల కిషోరేనంటూ పేర్కొన‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఇదిలా ఉండ‌గా బ్ర‌హ్మానందం త‌న‌యుడు రాజా గౌత‌మ్ ప్ర‌ధాన పాత్ర‌లో బ్ర‌హ్మ ఆనందం సినిమాకు సంబంధించిన టీజ‌ర్ రిలీజ్ చేశారు. స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై రాహుల్ యాద‌వ్ దీనిని నిర్మిస్తుండ‌గా ఆర్వీఎస్ నిఖిల్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో కీల‌క‌మైన పాత్ర‌లో న‌టించాడు వెన్నెల కిషోర్.

వ‌చ్చే నెల ఫిబ్ర‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. టీజ‌ర్ రిలీజ్ సంద‌ర్బంగా బ్ర‌హ్మానందం ముఖ్య అతిథిగా పాల్గొని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Also Read : Saif Ali Khan Attack : సైఫ్ ఇంట్లోకి దోపిడీ చేసేందుకు య‌త్నం

BrahmanandamCommentsVennela KishoreViral
Comments (0)
Add Comment