Brahmanandam : తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న అరుదైన నటుడు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం. తన తనయుడు రాజా గౌతమ్ తో కలిసి నటించిన బ్రహ్మా ఆనందం చిత్రానికి సంబంధించి టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించాడు కమెడియన్ వెన్నెల కిషోర్. తను ఏ పాత్రకైనా ఇట్టే సరి పోతాడని కితాబు ఇచ్చారు బ్రహ్మానందం.
Brahmanandam Movie..
అంతే కాదు మరో అడుగు ముందుకేసి తన నట వారసుడు ఎవరైనా సినీ ఇండస్ట్రీలో ఉన్నారంటే ఒకే ఒక్కడు వెన్నెల కిషోర్ అంటూ సంచలన ప్రకటన చేశారు . నిజ జీవితంలో తండ్రీ కొడుకులుగా ఉన్న రాజా గౌతమ్, బ్రహ్మి ఈ సినిమాలో మాత్రం తాత మనవళ్లుగా నటిస్తుండడం విశేషం.
చాలా గ్యాప్ తర్వాత రాజా గౌతమ్ నటిస్తున్న సినిమా ఇది కావడం విశేషం. ఈ సినిమా పక్కాగా వినోదం పంచుతుందని చెప్పాడు డైరెక్టర్. స్వధర్మ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సారథ్యంలో బ్రహ్మ ఆనందం మూవీ రాబోతోంది. నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Also Read : Brahmanandam Shocking : నా వారసుడు వెన్నెల కిషోర్ – బ్రహ్మి