Brahma Anandam : జగమెరిగిన అద్భుతమైన నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం. తనతో పాటు కొడుకు గౌతమ్ తో కలిసి తాతా మనవడుగా నటించిన బ్రహ్మ ఆనందం(Brahma Anandam) చిత్రం విడుదలైంది. ఆర్వీఎస్ నిఖిల్ తొలిసారిగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మూవీకి పాజిటివ్ రెస్సాన్స్ వచ్చింది. ఆసక్తికరమైన కథాంశంతో ఆకట్టుకుంది. అయితే మిశ్రమ స్పందన లభించింది. థియేటర్లలో సినిమాను చూడలేక పోయిన వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా.
Brahma Anandam OTT Updates
ఇందులో భాగంగా తీపి కబురు చెప్పింది. నిజ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిన అరుదైన నటుడు బ్రహ్మానందం. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. జీవితంలో ఫిలాసఫీని గొప్పగా అభివర్ణించిన గొప్ప మేధావి. కళాకారుడు, చేయి తిరిగిన రచయిత, అంతకు మించిన శిల్పి, ఆర్టిస్ట్. కన్నెగంటి కుటుంబం నుంచి వచ్చిన బ్రహ్మానందం ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించారు. ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేశారు. ఆయన ఏది చేసినా ఏది మాట్లాడినా అది వినసొంపుగా ఉంటుంది. అంతకు మించి అద్భుతంగా తోస్తుంది.
ఇక బ్రహ్మానందంలోని మరో కోణం కూడా ఉందని నిరూపించే ప్రయత్నం చేశాడు దిగ్గజ దర్శకుడు కృష్ణవంశీ. తనతో పాటు ప్రకాశ్ రాజ్ తో రంగ మార్తాండ తీశాడు. ఇందులో లీనమై పోయి నటించాడు బ్రహ్మానందం. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ప్రస్తుతం ఆహా కీలక ప్రకటన చేసింది. మార్చి 14న బ్రహ్మ ఆనందం సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. సో ..ఫ్యాన్స్ ఇంకెందుకు ఆలస్యం చూసేందుకు రెడీ అయి పోండి ఇక.
Also Read : Hero Mahesh SSMB29 :ఓడిశా అడవుల్లో జక్కన్న మూవీ షూటింగ్