Brahma-Anandam : తన పేరు చెబితే చాలు నవ్వు వస్తుంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ కమెడియన్ గా , విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. ఆయన అసలు పేరు కన్నెగంటి బ్రహ్మానంద(Brahma-Anandam) చారి. చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాడు. తల్లిదండ్రుల కష్టార్జితం, ఇతరుల మద్దతుతో బాగా చదువుకుని లెక్చరర్ గా పని చేశాడు. ఇదే సమయంలో తనకు సాహిత్యం, నాటక రంగం పట్ల ఉన్న అభిరుచి తనను నాటకాల్లో వేషాలు వేసేలా చేసింది. అంతే కాదు తను మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. ముఖకవలికలను , భావోద్వేగాలను అన్ని రకాలుగా ప్రతిఫలించేలా చేయడంలో తనకు మించిన నటుడు లేరంటే అతిశయోక్తి కాదేమో.
Brahma-Anandam Movie Updates
ఈ మధ్యన కృష్ణవంశీ దర్శకత్వంలో సీరియస్ పాత్ర ఒకటి చేశాడు. అదే మరాఠాలో అద్భుత విజయం సాధించిన రంగ మార్తాండ. ఈ చిత్రంలో తన నటన నభూతో నభవిష్యత్. తాజాగా బ్రహ్మ ఆనందం మూవీలో నటించాడు.
బ్రహ్మానందం నటుడే కాదు ప్రతిభావంతుడు, మేధావి, వక్త, శిల్పి, చిత్రకారుడు..ఇలా ఎన్నో విభాగాలలో తనదైన ముద్ర కనబర్చాడు. షూటింగ్ లకు ఠంఛన్ గా హాజరవడం , ఆ తర్వాత ఇంటికి వెళ్లి పోవడం, పుస్తకాలను చదవడం, రాయడం తన దైనందిన ప్రక్రియ.
బ్రహ్మానందం బ్రహ్మ ఆనందం చిత్రంలో తాతగా నటించడగా తనయుడు గౌతమ్ మనవడి పాత్రలో నటించడం విశేషం. ఇంకో విశేషం ఏమిటంటే కీలకమైన పాత్రలో కమెడియన్ వెన్నెల కిశోర్ నటించడం. ఈ మధ్యనే తన వారసత్వం ఒక్క వెన్నెలకే ఉందన్నాడు బ్రహ్మానందం.
ఇదిలా ఉండగా ఈనెల 14న బ్రహ్మ ఆనందం రాబోతోంది. దీనిని ప్రమోట్ చేసేందుకు ట్రై చేస్తున్నారు డార్లింగ్ ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి. ఇవాళ నిలదొక్కుకునేందుకు చిరు చేసిన సాయం మరిచి పోలేనన్నాడు బ్రహ్మానందం. వీరి సపోర్ట్ లో బ్రహ్మ ఆనందం సక్సెస్ కావాలని ఆశిద్దాం.
Also Read : Prudhvi Shocking Comments :పృథ్వీ కామెంట్స్ లైలాకు షాక్