Brad Pitt: రేసింగ్‌ కిక్‌ నిచ్చేలా ‘ఎఫ్‌1’ సినిమా !

రేసింగ్‌ కిక్‌ నిచ్చేలా 'ఎఫ్‌1' సినిమా !

Brad Pitt: హాలీవుడ్‌ యాక్షన్‌ హీరో బ్రాడ్‌ పిట్‌ నుంచి వస్తున్న తాజా రేసింగ్‌ అడ్వెంచరస్‌ సినిమా ‘ఎఫ్‌ 1’. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్న ఈ సినిమాకి జోసెఫ్‌ కొసిన్‌స్కీ దర్శకత్వం వహిస్తున్నారు. ఫార్ములా వన్‌ రేస్‌ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనితో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ ను విడుదల చేసారు చిత్ర యూనిట్.

Brad Pitt…

ఇందులో హై ఆక్టేన్‌ యాక్షన్‌ సన్నివేశాలు రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయి. బ్రాడ్‌ పిట్‌ ఫార్ములా వన్‌ రేసర్‌ గా కనిపించారు. రేసులో ప్రత్యర్థులతో తలపడుతూ తృటిలో భయంకరమైన ప్రమాదాల నుంచి తప్పించుకోవడం చాలా ఆశక్తకరంగా చూపించారు. డామ్సన్‌ ఇడ్రిస్, జేవియర్‌ బార్డెమ్, కెర్రీ కాండన్‌ కీలక భూమికలు పోషిస్తున్న ఈ హాలీవుడ్‌ సినిమా వచ్చే ఏడాది జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Turbo: ఓటీటీలోకి మలయాళ మెగాస్టార్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Brad PittF1holly wood
Comments (0)
Add Comment