Boyapati : టాలీవుడ్ లో దమ్మున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati). హింసను ఇష్ట పడే వాళ్లకు తను తెగ నచ్చుతాడు. తెర పై బాంబులు, బరిసెలు, కత్తులు, కొడవళ్లు, తుపాకులు, నరకడాలు, చంపడాలు, బీభత్సమైన, భయానక దృశ్యాలను తీయడంలో తనకు తనే సాటి. ఇక తనకు రౌద్రాన్ని, భావోద్వేగాలను మరింత సీరియస్ గా పలికించడంలో అందరికంటే ముందుంటాడు నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ. తన దర్శకత్వంలో తీసిన అఖండ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
Director Boyapati Focus on
దీంతో మూవీ మేకర్స్ మరోసారి అఖండకు సీక్వెల్ గా తీస్తున్నాడు. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగిన మహా కుంభ మేళాలో కొన్ని సీన్స్ తీశాడు. సినిమాను సాధ్యమైనంత వరకు త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేశాడు.
అఖండ2 మూవీకి సంబంధించి తాజా అప్ డేట్ వచ్చింది. అదేమిటంటే సినిమాకు హైలెట్ గా నిలిచే ఫైట్ సీన్స్ ను ఏకంగా హిమాలయాల్లో ప్లాన్ చేశాడని టాక్. ఇప్పటికే అక్కడికి చేరుకుని ఎక్కడ సీన్స్ తీయాలనే దానిపై ప్లేసెస్ చూస్తున్నాడని, వీర లెవల్లో ఉండేలా తీయాలని కంకణం కట్టుకున్నాడట బోయపాటి శ్రీను. ఇప్పటికే అఖండ -2 సీక్వెల్ సినిమాకు సంబంధించి ఇటీవలే కీలక షెడ్యూల్ ను హైదరాబాద్ లో పూర్తి చేశాడు.
Also Read : Hero Prabhas-Kannappa :షేక్ చేస్తున్న ప్రభాస్ కన్నప్ప టీజర్