Border 2: 27 ఏళ్ళ తరువాత ‘బోర్డర్‌’ సినిమాకు సీక్వెల్ !

27 ఏళ్ళ తరువాత ‘బోర్డర్‌’ సినిమాకు సీక్వెల్ !

Border 2: భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సూపర్ హిట్ సినిమాల్లో ‘బోర్డర్‌’ ఒకటి. దేశ సైనికుల త్యాగాలను, వారి పోరాటాలను కళ్లకు కట్టినట్లు చూపించిన సినిమా ఇది. ఇండో-పాకిస్థాన్‌ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. సన్నీ డియోల్, జాకీ ష్రాఫ్, సునీల్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని జేపీ దత్తా తెరకెక్కించారు. కథ, భావోద్వేగాలు, సంగీతంతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను కదిలించిన ఈ చిత్రం విడుదలై ఈరోజుతో 27ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దీనికి సీక్వెల్‌ను ప్రకటిస్తూ… ఓ వీడియోను పంచుకున్నారు సన్నీ డియోల్‌.

Border 2 Movie Updates

ఇరవయ్యేడేళ్ల తర్వాత హిందీ హిట్‌ ఫిల్మ్‌ ‘బోర్డర్‌(Border)’కు సీక్వెల్‌గా ‘బోర్డర్‌ 2’ను తెరకెక్కిస్తున్నట్లు సన్నీ డియోల్‌ అధికారికంగా ప్రకటించారు. ఆయన హీరోగా జేపీ దత్తా దర్శకత్వంలో 1997 జూన్‌ 13న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్‌గా నిలిచింది. కాగా ‘బోర్డర్‌’ చిత్రం విడుదలై గురువారం (జూన్‌ 13) నాటికి సరిగ్గా 27 సంవత్సరాలు. ఈ సందర్భంగా ‘బోర్డర్‌ 2’ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్‌. కానీ ‘బోర్డర్‌’కు దర్శకత్వం వహించిన జేపీ దత్తాకు బదులుగా దర్శకుడు అనురాగ్‌ సింగ్‌ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు.

‘‘ఒక సైనికుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి 27 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నాడు. ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ వార్‌ ఫిల్మ్‌’’ అంటూ ఓ వీడియోను షేర్‌ చేశారు సన్నీ డియోల్‌. భూషణ్‌ కుమార్, క్రిషణ్‌ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ఆయుష్మాన్‌ ఖురానా కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ‘బోర్డర్‌’ చిత్రం 1971లో జరిగిన ఇండియా–΄ాకిస్తాన్‌ యుద్ధం నేపథ్యంలో ఉంటుంది. ఈ చిత్రం సీక్వెల్‌ కథపై స్పష్టత రావాల్సి ఉంది.

Also Read : Decoit: భాగ్యనగరంలో అడవిశేష్, శృతిహాసన్ ‘డెకాయిట్‌’ యాక్షన్‌ !

Border 2Sunny Deol
Comments (0)
Add Comment