Saif Ali Khan : సౌత్ మీదే నమ్మకాన్ని పెట్టుకున్న బాలీవుడ్ స్టార్

సౌత్‌లో ఎలాగైనా సక్సెస్‌ చూడాలని ఫిక్స్ అయ్యారు...

Saif Ali Khan : పోగొట్టుకున్న చోటే వెతుక్కుందామని ఫిక్సయ్యారు సైఫ్‌ అలీఖాన్‌. అందుకే ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సౌత్‌లో స్ట్రాంగ్‌గా నిలదొక్కుకోవడానికి డార్లింగ్‌ హెల్ప్ తీసుకున్నారు. అది కాస్తా ఫెయిల్‌ కావడంతో ఇప్పుడు తారక్‌తో కలిసి సెప్టెంబర్‌లో లక్‌ టెస్ట్ కి రెడీ అవుతున్నారు. విక్రమ్‌ వేదా తర్వాత బాలీవుడ్‌లో స్ట్రెయిట్‌గా ఒక్క రిలీజ్‌ కూడా లేదు సైఫ్‌ అలీ ఖాన్‌కి. హృతిక్‌, సైఫ్‌ చేసిన ఆ సినిమా నార్త్ లో డీసెంట్‌ హిట్‌గా రికార్డయింది. విక్రమ్‌ వేదా పూర్తి కాగానే ఆదిపురుష్‌ చేశారు సైఫ్‌(Saif Ali Khan). ఓమ్‌ రవుత్‌ డైరక్షన్‌లో ఆదిపురుష్‌లో రావణాసురుడిగా కనిపించారు. ఆదిపురుష్‌ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడింది. సైఫ్‌ కేరక్టర్‌ డిజైన్‌ చేసిన తీరు మీద విపరీతంగా ట్రోల్స్ కనిపించాయి.

Saif Ali Khan Movies Update

అయినా అవేమీ పట్టించుకోలేదు సైఫ్‌. ట్రిపుల్‌ ఆర్‌తో నేషనల్‌ లెవల్లో ఫేమ్‌ తెచ్చుకున్న తారక్‌ తో కలిసి దేవరలో చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. సౌత్‌లో ఎలాగైనా సక్సెస్‌ చూడాలని ఫిక్స్ అయ్యారు. సెప్టెంబర్‌ 27న దేవరతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన దేవర భైర టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. తారక్ – సైఫ్‌ స్క్రీన్‌ మీద తలపడే సీన్లు చూడాలని ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు ఆడియన్స్. ఈ సినిమా తర్వాత హిందీలో జువెల్‌ థీఫ్‌లో నటిస్తున్నారు సైఫ్‌. దాని తర్వాత చేయబోయే రేస్‌ 4 మీద మాత్రం ఇప్పటికే మంచి బజ్‌ క్రియేటైంది.

Also Read : Hero Nani : అలిపిరి మెట్ల మార్గంలో వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న నేచురల్ స్టార్

MoviesSaif Ali KhanUpdatesViral
Comments (0)
Add Comment