Bollywood Producer : ఆ సంస్థ వారు మమ్మల్ని కావాలనే మోసం చేసారు

'భూల్ భులయ్యా 3' సినిమా నవంబర్ 1న రిలీజై తొలి రోజే రూ.36 కోట్ల కలెక్షన్ల్స్ తో దుమ్మురేపింది...

Bollywood : ఈ దీపావళికి బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్ ‘సింగం అగైన్’, కార్తిక్ ఆర్యన్ నటించిన ‘భూల్ భులయ్యా 3’ విడుదలై మంచి కలెక్షన్స్ ని సాధించాయి. అయితే భూల్ భులయ్యా 3 ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్(Bhushan Kumar) మాత్రం ఓ సినిమా మేకర్స్‌పై కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక నిర్మాణ సంస్థ తీసుకున్న అనవసరపు నిర్ణయాల వల్లే మేము మరిన్ని లాభాలు మిస్ అయ్యాం అని వాపోయారు.

Bollywood Producer Bhushan Kumar Comments

‘భూల్ భులయ్యా 3’ సినిమా నవంబర్ 1న రిలీజై తొలి రోజే రూ.36 కోట్ల కలెక్షన్ల్స్ తో దుమ్మురేపింది. 12 రోజుల్లోనే రూ.220 కోట్లు కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ మాట్లాడుతూ.. మొదటగా మాకు సింగం అగైన్ మూవీ టీమ్ అన్యాయం చేసిందన్నారు. మేము తొలుతగా నవంబర్ 1ని రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సింగం అగైన్ టీమ్ కూడా కావాలని అదే రోజు సినిమా రిలీజ్ ప్లాన్ చేశారన్నారు. ఈ విషయంపై వాళ్ళతో మాట్లాడిన ఎలాంటి లాభం లేకుండాపోయింది అన్నారు.అయితే ఈ విషయంలో రెండు టీముల మధ్య ఆర్గ్యుమెంట్స్ కూడా నడిచాయట. ఇక ఈ ఎపిసోడ్ ముగిశాక.. థియేటర్ల పంపిణీ విషయంలోనూ తనకి అన్యాయం చేశారని వాపోయారు నిర్మాత భూషణ్ కుమార్. ఆయన మొదట రెండు సినిమాలకి సమానంగా థియేటర్లు పంచాలని కోరారట. కానీ.. అన్యాయమే జరిగిందన్నారు. అయితే ఎన్నో చర్చల తర్వాత సింగం ప్రొడ్యూసర్స్ మాకు సహకరించారని తెలిపారు. మా సినిమాకి భారీ రేంజ్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ రావడంతో కొన్ని థియేటర్లు పెంచారన్నారు. లేకపోతే ఓటీటీలో రిలీజ్ చేసుకోవాల్సి వచ్చేది అన్నారు.

Also Read : Rashmika-Pushpa 2 : ‘పుష్ప 2’ నుంచి ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేసే అప్డేట్ ఇచ్చిన రష్మిక

BollywoodBreakingCommentsProducerViral
Comments (0)
Add Comment