Shah Rukh Khan : ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య తర్వాత బాలీవుడ్‌లో హై అలర్ట్ ఏర్పడింది. ఇప్పటికే స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్‌కి పలు బెదిరింపులు రావడంతో అలర్ట్ అయినా పోలీసులు ఆయనకు భద్రత పెంచారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఇప్పుడు కొందరు బాలీవుడ్ ‘బాద్ షా’ షారుఖ్‌ని టార్గెట్ చేశారు. చంపేస్తామని కాల్ చేసి బెదించారు. దీంతో పోలీసులు యాక్షన్‌లోకి దిగారు.
Shah Rukh Khan Got Threatning Calls…
సల్మాన్‌ఖాన్‌ని వరుస బెదిరింపు కాల్స్‌తో ఆందోళనపరిచిన కొందరు ఇప్పుడు ‘షారుఖ్ ఖాన్’ని టార్గెట్ చేశారు. తాజాగా షారుఖే డైరెక్ట్ వార్నింగ్ కాల్ రావడంతో ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అయితే ఈ కాల్ చేసింది ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నివాసి ఫైజాన్‌గా గుర్తించినట్లు తెలిసింది. అయితే మూలలను గుర్తించిన పోలీసులు ఇప్పటికే రాయ్‌పూర్ బయలుదేరినట్లు తెలుస్తోంది. కాగా, బాబా సిద్ధిఖీ, షారుఖ్, సల్మాన్‌ల మధ్య మంచి స్నేహం ఉంది.
Also Read : Samantha-Citadel : ఓటీటీలో సమంత నటించిన అవైటెడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’