Ravi Teja : పలు పరాజయాలను చవిచూసిన రవితేజకు ప్రస్తుతం బ్లాక్ బస్టర్ అవసరం చాలా ఎక్కువ. అందుకే మన హీరో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. రవితేజ చేయబోయే సినిమాల్లో మొదటిది ఈగల్. ఈ సంక్రాంతికి పనులన్నీ పూర్తి చేసి థియేటర్లకు వెళ్ళవలసింది ఈ సినిమా. అయితే సంక్రాంతి సీజన్‌లో మరో నాలుగు సినిమాలు విడుదల కానుండటంతో నిర్మాత నిర్ణయాన్ని మార్చుకుని ఫిబ్రవరి 9కి విడుదల తేదీని వాయిదా వేశారు.
Ravi Teja Movie Updates
‘ఈగల్’ తర్వాత రవితేజ(Ravi Teja) నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ చిత్రంలో మిరపకాయతో సూపర్‌హిట్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్‌తో కలిసి మాస్ మహారాజా నటించనున్నాడు. హిందీ సినిమా ‘రైడ్’కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది.
2018లో, దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా రైడ్ చిత్రానికి దర్శకత్వం వహించారు, ఇది 1980ల నాటి వాస్తవిక కథ ఆధారంగా ఉంటుంది , ఈ సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా నటించారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు రాజకీయ నాయకుల ఇళ్లలో సోదాలు చేయడం, అక్కడ ఏం జరుగుతుంది అనేదానిపై సినిమా చుట్టూ తిరుగుతుంది. రాజకీయ నాయకులు అతన్ని ఎలా వేధిస్తున్నారు అనేదానిపై ఈ కధ ఆధారపడి వుంటుంది. ఈ చిత్రం బాలీవుడ్‌లో ఘన విజయం సాధించింది. మళ్లీ ఐదేళ్ల తర్వాత తెలుగులో మిస్టర్ బచ్చన్ పేరుతో ఈ సినిమా రూపొందుతోంది.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా, ‘రైడ్’ చిత్రాన్ని రవితేజ రీమేక్ చేయగా, ఈ హిందీ చిత్ర కథానాయకుడు అజయ్ దేవగన్ ‘రైడ్’ సీక్వెల్‌ను ప్రకటించాడు. నిన్న “రైడ్ 2` అనే పోస్టర్‌ని విడుదల చేసి పూజా కార్యక్రమాలు కూడా జరిపారు.ఈ చిత్రాన్ని కూడా రాజ్‌కుమార్ గుప్తా తెరకెక్కించనున్నారు.
ఈ తొలి పూజలో హరీష్ శంకర్, రవితేజ(Ravi Teja) కూడా పాల్గొనడం మరో విశేషం. నిన్న ఉదయం వీరిద్దరూ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పూజలో పాల్గొనేందుకు ముంబైకి వెళ్లారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
“రైడ్ 2` చిత్రాన్ని నవంబర్ 15, 2024 తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. అంతకంటే ముందు రవితేజ వస్తాడా లేక మిస్టర్ బచ్చన్ వస్తాడా అనేది చూడాలి. మరి రైడ్ తెలుగులో ఘనవిజయం సాధిస్తే రవితేజ రైడ్ 2ని కూడా రీమేక్ చేస్తాడా? లేదా రైడ్ 2 దేశవ్యాప్తంగా విడుదలవుతుందా, అవుననే సమాధానం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read : AR Rahman: రామ్ చరణ్ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం !