Deepika : ఇక ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపిక… ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. తాజాగా ఈ అమ్మడు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టినట్లుగా తెలుస్తోంది. దీపికా పదుకొణె, ఆమె భర్త రణవీర్ సింగ్ ఇండియాలోనే అత్యుత్తమ ఇళ్లల్లో ఒకటిగా పేరుపొందిన షారుఖ్ ఖాన్ ‘మన్నత్’ ఇంటి పక్కనే కొత్త ఇంటిని కొనుగోలు చేశారు.
Deepika Padukone…
ముంబైలోని ప్రతిష్టాత్మకమైన, ఖరీదైన ప్రాంతం అయిన బాంద్రాలో ఈ ఇల్లు ఉంది. ఈ ఇంటి విస్తీర్ణం 11,266 చదరపు అడుగులు. ఈ ఇంటి టెర్రస్ 1400 చదరపు అడుగుల వెడల్పుతో ఉంటుందట. ఇది అపార్ట్మెంట్ ఇల్లు. మొత్తం నాలుగు అంతస్తులు. దీపికా, రణ్‌వీర్ సింగ్ 16వ అంతస్తు నుంచి 19వ అంతస్తు వరకు ఉన్న ఇంటిని కొనుగోలు చేశారని.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేస్తున్నారని.. బాలీవుడ్ న్యూస్. అంతేకాదు ఈ ఇంటి కోసం ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారని బీటౌన్‌లో టాక్.
Also Read : Beauty Preity Zinta : లాస్ ఏంజెల్స్ కార్చిచ్చు పై నటి విచారకర పోస్ట్