Shilpa Shetty Case : కోర్టు మెట్లెక్కిన ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి

అంతేకాదు ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టానని....

Shilpa Shetty : బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై చీటింగ్ కేసు నమోదైంది. వీరిద్దరితోపాటు మరికొందరి పై కూడా కేసు నమోదు చేయాలని ముంబై కోర్టు పోలీసులను ఆదేశించింది. న్యూగోల్డ్ స్క్రీమ్ ద్వారా తనను మోసం చేశారంటూ వ్యాపారి పృథ్వీరాజ్ సరేమల్ కొఠారి చేసిన ఫిర్యాదు మేరకు ముంబై అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఎన్పీ మెహతా పోలీసులను ఆదేశించారు. ఈ కేసులో పూర్తి విచారణ జరపాలని ఆదేశించింది ముంబై కోర్టు. ఇక అసలు విషయం ఏంటంటే..! శిల్పా శెట్టి(Shilpa Shetty), ఆమె భర్త కుంద్రా కలిసి సత్యుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను 2014లో ప్రారంభించారు. దీనికింద ముందుగా బంగారు పెట్టుబడులు పెడితే లాభదాయకమైన రాబడి వస్తుందని చెప్పి ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టించారని.. ఆ తర్వాత మార్కెట్ విలువలతో సంబంధం లేకుండా నిర్ణీత రేటుకు బంగారం డెలివరీ చెస్తామని హామీ ఇచ్చారని సదరు వ్యాపారి ఫిర్యాదులో పేర్కొన్నారు.

Shilpa Shetty Case Updates

అంతేకాదు ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టానని.. అయితే 2019 ఏప్రిల్ 2న మెచ్యురిటీ తేదీ రాగానే తనకు ఇస్తానని చెప్పిన బంగారం ఇవ్వలేదని ఈ స్కీమ్ లో తాను 90 లక్షలకు పైగా పెట్టుబడి పెట్లినట్లు వ్యాపారి పృథ్వీరాజ్ సరేమల్ కొఠారి ఫిర్యాదులో పేర్కొన్నాడు. శిల్పాశెట్టి సంతకం చేసిన కవర్ లెటర్ తోపాటు.. సత్యుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ జారీ చేసిన ఇన్‌వాయిస్‌ను కూడా కోర్టులో సమర్పించారు. దీనిపై విచారణ జరిపిన ముంబై కోర్టు శిల్పా శెట్టితోపాటు ఆమె భర్త రాజ్ కుంద్రా, మరికొందరిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. అలాగే దీనిపై దర్యాప్తు చేసి మోసం చేసినట్లు తేలీతే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ల కింద వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

Also Read : Vithika Sheru : తన భర్త వరుణ్ సందేశ్ కోసం కీలక వ్యాఖ్యలు వెల్లడించిన వితిక

BreakingPolice CaseShilpa ShettyUpdatesViral
Comments (0)
Add Comment