Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ త్వరలోనే టాలీవుడ్‌లోకి అడుగు పెట్టనుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టనుంది. అయితే జాన్వీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయ్యింది. 2018లో ధడక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. స్టార్ కపుల్ బోనీకపూర్, శ్రీదేవిల కూతురు కావడం వల్లనే జాన్వీకి సినీ పరిశ్రమలో అవకాశం ఈజీగానే వచ్చింది. అయినప్పటికీ ఈ అమ్మడికి సక్సెస్ మాత్రం దక్కడంలేదు. జాన్వీ కెరీర్ లో పెద్ద హిట్ మాత్రం దక్కలేదు. ఈ అమ్మడు రకరకాల ప్రయోగాలు చేసింది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. కానీ ఒక్క సినిమాను కూడా హిట్ అవ్వలేదు. తాజాగా జాన్వీ(Janhvi Kapoor) నటించిన ‘ఉలాజ్’ బాక్సాఫీస్ వద్ద పేలవమైన వసూళ్లను రాబట్టింది.
Janhvi Kapoor Movie Updates
సుధాన్షు సరియా దర్శకత్వం వహించిన చిత్రం ‘ఉలాజ్’. ఈ సినిమా రీసెంట్ గా విడుదలైంది. దేశవ్యాప్తంగా తొలిరోజు (ఆగస్టు 2న ) కోటి, రెండో రోజు రూ.1.75 కోట్లు, ఆదివారం (ఆగస్టు 4)న రూ.2 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా మొత్తం వసూళ్లు 4.75 కోట్ల రూపాయలు. దీంతో సినిమా 10 కోట్ల వసూళ్లు రాబట్టలేని పరిస్థితి నెలకొంది. దాంతో జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఖాతాలో మరో ఫ్లాప్ పడింది. 2018లో విడుదలైన ‘ధడక్’ సినిమా పర్లేదనిపించుకుంది. ఈ సినిమాలో జాన్వీ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
విమర్శకుల ప్రశంసలు అందుకుంది జాన్వీ కపూర్. జాన్వీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ఇది నిలిచింది. ఆ తర్వాత ‘రూహి’, ‘గుడ్ లక్ జెర్రీ’, ‘మిలి’, ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సినిమాలు విడుదలై ఫ్లాప్‌గా నిలిచాయి. ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు. జాన్వీ కపూర్ ప్రస్తుతం సౌత్ లో బిజీగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమాలో ఈమె హీరోయిన్ గా చేస్తోంది. అలాగే రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాలోనూ జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యింది. ఇప్పుడు టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఒప్పుకుంటుంది. నాని హీరోగా నటిస్తున్న సినిమాలోనూ జాన్వీ హీరోయిన్‌గా అయ్యిందని టాక్ వినిపిస్తుంది.
Also Read : SIMBAA Movie : జనాల్లోకి మరో కొత్త లైన్ తో వస్తున్న ‘సింబా’ సినిమా టీమ్