SSMB29 Movie : రాజమౌళి సినిమాలో మహేష్ తో స్టెప్పులేయనున్న బాలీవుడ్ భామ

అందుకే ఆమెను కథానాయికగా తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు టాక్‌ నడుస్తోంది...

SSMB29 : మహేశ్‌ బాబు హీరోగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ”ఎస్‌ఎస్‌ఎంబీ 29(SSMB29)’ రానున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన కొన్ని అప్‌డేట్‌ల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనున్నట్లు గతంలో వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి. ఇప్పుడు మరో నటి పేరు తెరపైకి వచ్చింది. బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో ఆమె నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమెతో చర్చలు జరిపినట్లు టాక్‌ వినిపిస్తుంది.

SSMB29 Movie Updates

ఇందులో హీరోతోపాటు హీరోయిన్‌ ప్రాతకు ప్రాధాన్యం ఉంటుందని ప్రియాంక అయితే ఆ పాత్రకు న్యాయం చేయగలరని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆమెను కథానాయికగా తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు టాక్‌ నడుస్తోంది. ప్రియాంక కూడా ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారట. ఈ పాత్ర కోసం ఆమె ప్రిపరేషన్‌ కూడా మొదలు పెట్టారని సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు కనిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతోంది. ఏప్రిల్‌ నుంచి ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి పోస్ట్‌లు చూసి విసిగిపోయిన అభిమానులు మాత్రం అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రంలో భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటిదాకా చూడని, ఎవరూ చూపించని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్రప్రసాద్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లో దీనిని అనువదించనున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read:Sankranthiki Vasthunnam : యూట్యూబ్ లో హల్చల్ గా మారిన వెంకీ మామ గోదారి గట్టు సాంగ్

Mahesh BabuPriyanka ChopraSSMB29TrendingUpdatesViral
Comments (0)
Add Comment