Bobby Deol: ‘యానిమల్‌’ కోసం బాబీ డియోల్ త్యాగం

‘యానిమల్‌’ కోసం బాబీ డియోల్ త్యాగం

Bobby Deol : ఇండియాలో ‘యానిమల్‌’ సినిమా ట్రెండ్ నడుస్తోంది. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్, రష్మిక హీరోహీరోయిన్లుగా అనిల్ కపూర్, బాబీ డియోల్(Bobby Deol) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు ముందే సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల విడుదల అయిన ట్రైలర్ లో రణబీర్ తో పాటు విలన్ బాబీ డియోల్ ల లుక్స్ ప్రేక్షకులను మంత్ర ముగ్థులను చేస్తున్నాయి.

చాక్లెట్ బాయ్ గా పేరుతెచ్చుకున్న రణబీర్ కపూర్… ‘యానిమల్‌’  సినిమాలో వయలెంట్ లుక్ తో అదరగొడితే… అతనికి పోటీగా విలన్ బాబీ డియోల్ చేసిన బాడీ బిల్డింగ్, వయలెన్స్, విలనిజం… సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్ళిపోయారు. దీనితో ఎక్కడ చూసినా ‘యానిమల్‌’ సినిమా గురించే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బాబీ డియోల్ ఫిట్ నెస్ పై ట్రైనర్ ప్రజ్వల్ శెట్టి తాజా ఇంటర్వూలో ఆశక్తికర వ్యాఖ్యలు చేసారు. బాబీ డియోల్ ఫిట్ నెస్ పై ట్రైనర్ ప్రజ్వల్ శెట్టి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Bobby Deol – బాబీ డియోల్ ఫిట్ నెస్ సీక్రెట్స్ బయపెట్టిన ట్రైనర్ ప్రజ్వల్ శెట్టి

ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో బాబీ డియోల్ పర్సనల్ ట్రైనర్ ప్రజ్వల్ శెట్టి కీలక వ్యాఖ్యలు చేసారు. ‘‘దాదాపు ఆరేళ్ల నుంచి బాబీకి ట్రైనర్‌గా పనిచేస్తున్నాను. ‘యానిమల్‌’లో ప్రతినాయకుడి పాత్ర కోసం ఆయన్ని ఎంచుకున్నప్పుడు లుక్‌ విషయంలో చిత్ర దర్శకుడు సందీప్‌ వంగా కొన్ని సూచనలు చేశారు. రణ్‌బీర్‌ కపూర్‌ కంటే భారీగా బాబీ కనిపించాలని చెప్పారు. అందుకు నాలుగు నెలలు టైమ్‌ ఇచ్చారు. దీనితో స్వీట్స్‌ తినకుండా కచ్చితమైన డైట్‌ ఫాలో అవుతూ బాబీ కఠోర సాధన చేశాడు. ట్రైనింగ్ అనంతరం బాబీ లుక్‌ చూసి టీమ్‌ ఎంతో ఆనందించింది. ముఖ్యంగా క్లైమాక్స్‌ షూట్‌ రోజు బాబీ నన్ను సెట్‌కు ఆహ్వానించి మెచ్చుకున్నారు’’ అని ప్రజ్వల్‌ తెలిపారు.

దీనితో ‘యానిమల్‌’ సినిమా కోసం బాబీ డియోల్(Bobby Deol) ఇంత కష్టపడ్డారా… ఇన్ని త్యాగాలు చేసారా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కళ్ళెదుట స్వీట్స్ ఉంచుకుని… నాలుగు నెలల పాటు తినకుండా ఉండటం అంతే అంత ఈజీ కాదని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు బాబీ డియోల్ త్యాగానికి తగిన గుర్తింపు వస్తుందంటూ సినిమాకు అడ్వాన్స్ గా కంగ్రాట్స్ చెప్తున్నారు.

డిసెంబరు 1 వస్తున్న ‘యానిమల్‌’

అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్, రష్మిక హీరోహీరోయిన్లుగా అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘యానిమల్‌’. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 1న విడుదల కానుంది. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుని ‘A’ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా… 3 గంటల 21 నిమిషాల 23 సెకన్లు & 16 ఫ్రేమ్స్‌ నిడివి(రన్ టైం/డ్యూరేషన్)తో ఇటీవల కాలంలో విడుదలైన భారీ నిడివి గల చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇది ఇలా ఉండగా దర్శకుడు సందీప్ వంగా విడుదల చేసిన ట్రైలర్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాల జాబితాలో చేరింది. ‘యానిమల్‌’

Also Read : Amitabh Bachchan: కుమార్తెకు ఖరీదైన బంగ్లా గిఫ్ట్ ఇచ్చిన బిగ్ బి !

animalBobby DeolRanabir Kapur
Comments (0)
Add Comment