Bobby Deol: క్రూరమైన ఉధిరన్ గా బాబీ డియోల్ ఫస్ట్ లుక్ !

క్రూరమైన ఉధిరన్ గా బాబీ డియోల్ ఫస్ట్ లుక్ !

Bobby Deol: వేదాళం, వివేగం, విశ్వాసం, అన్నాత్తే వంటి సూపర్ హిట్ సినిమాల డైరెక్టర్ శివ (సిరుతై శివ) దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా సినిమా ‘కంగువా’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో విలన్ గా యానిమల్ తో సరికొత్త అవతారం చూపించిన బాబీ డియోల్ నటిస్తున్నారు. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దిశా పఠానీ హీరోయిన్ గా, జగపతి బాబు, యోగిబాబు, తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా సుమారు 38 భాషల్లో విడుదల చేయబోతున్నట్లు… నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజా ప్రకటించడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన టైటిల్, సూర్య ఫస్ట్ లుక్ కు విశేషమైన స్పందన వచ్చింది. దీనితో తాజాగా ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న బాబీ డియోల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు మూవీ మేకర్స్. ప్రస్తుతం ‘కంగువా’ నుండి విడుదలైన బాబీ డియోల్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

Bobby Deol Movie Updates

బాలీవుడ్‌లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న బాబీ డియోల్(Bobby Deol)… ఇటీవల విడుదలైన ‘యానిమల్‌’లో విలన్‌ పాత్రలో నటించి మంచి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం సూర్య ‘కంగువా’ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న బాబీ డియోల్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను అతని పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ‘క్రూరమైన, శక్తిమంతమైన, మర్చిపోలేని… ఉధిరన్‌’ అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ కు జోడించింది. ఈ ఫస్ట్ లుక్ లో భిన్నమైన ఆహార్యంతో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు బాబీ. యుద్ధానికి సిద్ధమవుతున్న ఆయనకు ఆ వర్గ ప్రజలంతా తమ మద్దతు తెలుపుతున్నట్లు కనిపిస్తున్న ఈ పోస్టర్‌… సినిమాపై అంచనాలను మరింత పెంచుతుంది. యానిమల్ సినిమా తరువాత బాబీ డియోల్ కు వరుస అఫర్లు వస్తున్నాయి. బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సినిమాలో బాబీ దేవోల్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్లు దర్శకుడు ప్రకటించారు.

Also Read : Mammootty: ఫిబ్రవరి 15న మమ్ముట్టి ‘భ్రమయుగం’ !

Bobby DeolKanguva
Comments (0)
Add Comment