BJP : ఢిల్లీ – దేశ రాజధాని కమలం వశమైంది. 27 ఏళ్ల అనంతరం పార్టీ పవర్ లోకి వచ్చింది. ఎవరూ ఊహించని రీతిలో 70 స్థానాలకు గాను బీజేపీ(BJP) 50 స్థానాలను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. 10 ఏళ్ల పాటు అధికారాన్ని చెలాయించిన ఆమ్ ఆద్మీ పార్టీ చాప చుట్టేసింది. కేవలం 20 స్థానాలకే పరిమితమైంది. ఇక వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదు. న్యూఢిల్లీ స్థానం నుంచి వరుసగా గెలుస్తూ వచ్చిన ఆప్ చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు మాజీ సీఎం కొడుకు పర్వేశ్ వర్మ(Parvesh Sharma). తను కేజ్రీవాల్ ను ఓడించి ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు.
BJP Delhi Victory
నెట్టింట్లో ఎవరీ పర్వేశ్ వర్మ అంటూ తెగ వెతుకుతున్నారు. ఇంతకీ వర్మ ఎవరు..ఎందుకు లైమ్ లైట్ లోకి వచ్చాడని తెలుసుకుంటే ఆసక్తి రేపక మానదు. తను నవంబర్ 7, 1977న పుట్టాడు.తన తండ్రి ఢిల్లీ మాజీ సీఎం, దివంగత సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు.
తను ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కిరోరి మాల్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి ఎంబిఏ పట్టా పొందాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన మాజీ కేంద్ర మంత్రి, బిజెపి నాయకుడు విక్రమ్ వర్మ కుమార్తె స్వాతి సింగ్‌ను వర్మ ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
పర్వేష్ వర్మ చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ తో అనుబంధం కలిగి ఉన్నాడు. కేశవ్‌పురంలో ‘శాఖ ప్రముఖ్’గా పనిచేశారు. ఆ తర్వాత బిజెపి సభ్యుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఢిల్లీ జనతా యువ మోర్చా జాతీయ కార్యనిర్వాహక సభ్యుడయ్యారు.
2013 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఢిల్లీ బిజెపి ఎన్నికల కమిటీలో భాగంగా ఉన్నారు . మెహ్రౌలి నుండి పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు. 2014లో వర్మ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి, పశ్చిమ ఢిల్లీ పార్లమెంటరీ స్థానం నుండి రికార్డు స్థాయిలో 2.6 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందాడు. పార్లమెంటు సభ్యుల జీతాలు, భత్యాలపై ఉమ్మడి కమిటీ, పట్టణాభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ, న్యూఢిల్లీలోని ఎయిమ్స్ పాలక మండలిలో పని చేశాడు.
2019లో పర్వేష్ వర్మ పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ స్థానాన్ని తిరిగి గెలుపొందాడు. ఏకంగా 5.78 లక్షల భారీ మెజారిటీతో విస్తు పోయేలా విజయాన్ని నమోదు చేశాడు. ముస్లింలపై నోరు పారేసుకున్నాడు. ముస్లిం సమాజాన్ని పూర్తిగా బహిష్కరించాలని పిలుపునిచ్చాడు. మొత్తంగా ఇప్పుడు సీఎం రేసులో ఉన్నాడు.
Also Read : BJP Delhi Victory :హస్తినలో కమల వికాసం