Salman Khan : సల్మాన్ కు బిష్ణోయ్ గ్యాంగ్ ఆలా చేయాలంటూ వార్నింగ్

అదే విమానంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు అనుచరులు కూడా ఉన్నారు...

Salman Khan : ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య తర్వాత బాలీవుడ్‌లో హై అలర్ట్ ఏర్పడింది. ఇప్పటికే స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్‌కి ముంబై పోలీసులు భద్రత పెంచారు. అలాగే తాము చెప్పినట్లు చేయకపోతే సల్మాన్ ఖాన్‌(Salman Khan)కి చావే అంటూ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ స్టాండప్ కమెడియన్‌ని కూడా బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ లిస్ట్‌లోకి చేర్చింది. బాలీవుడ్ సూపర్ సల్మాన్ ఖాన్ ఆప్త మిత్రుడు బాబా సిద్దిఖీ మరణాంతరం.. బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో సల్మాన్ ఖాన్ ఫస్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ముంబై పోలీసులు ఆయనకీ 24/7 సెక్యూరిటీ కల్పించారు. బిష్ణోయ్‌లకు పవిత్రమైన కృష్ణ జింకను సల్మాన్ వేటాడటంతో వీరి పేచీ మొదలైంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ తమ ఆలయంలో క్షమాపణ చెబితే అతని తప్పు క్షమించబడుతుందని బిష్ణోయ్ సభ ఆఫర్ చేసినట్టుగా తెలుస్తొంది. సల్మాన్ ఆలయంలోకి వచ్చెందుకు భయంగా ఉంటే.. అతని భద్రతా సిబ్బందిని కూడా వెంట తెచ్చుకోవచ్చని బిష్ణోయ్‌లు ఆఫర్ ఇచ్చారని సమాచారం.

Salman Khan-Bishnoi..

మరోపక్క బిగ్ బాస్ టైటిల్ విన్నర్, స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూకీ‌ని కూడా బిష్ణోయ్(Lawrence bishnoi) వర్గం‌ టార్గెట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హాస్యనటుడు మునావర్ ఫరూఖీని అంతమొందించాలని సెప్టెంబర్‌లోనే బిష్ణోయ్ గ్యాంగ్ ఫ్లాన్ చేసింది. కానీ.. తృటిలో అతడు తప్పించుకున్నట్లుగా తాజా విచారణలో వెల్లడైంది. మునావర్ ఫరూఖీని మట్టుబెట్టి లారెన్స్ బిష్ణోయ్ తనకు తానుగా హిందూ అండర్ వరల్డ్ డాన్ గా ముద్ర వేయించుకోవాలని అనుకున్నట్లుగా వెలుగులోకి వచ్చింది. మునావర్ ఫరూఖీ ముంబై నుంచి విమానంలో ఢిల్లీలో ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్నాడు.

అదే విమానంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు అనుచరులు కూడా ఉన్నారు. మునావర్ కదలికలను గమనిస్తూ వెంబడించారని.. ఢిల్లీలో ఫరూఖీ బస చేసే హోటల్లోనే గదులు కూడా బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అతడిపై దాడికి ముందే ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి పోలీసులకు నివేదిక అందడంతో పోలీసులు రక్షించి ముంబైకి తరలించినట్లుగా నిఘా వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఫరూఖీకి సైతం పోలీసులు భద్రత కొనసాగిస్తున్నారు. బిష్ణోయ్ గ్యాంగ్ లిస్టులో బాబా సిద్ధిఖీ కుమారుడు ప్రస్తుత ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ ఉన్నట్లు తేలింది. లారెన్స్ బిష్ణోయ్ అండర్ వరల్డ్ డాన్ కావాలనే కోరికతోనే బాబా సిద్ధిఖీని చంపినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. సల్మాన్ ఖాన్‌తో సాన్నిహిత్యం వల్లే బాబా సిద్దిఖీ హత్యకు ఓ ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగానే పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Also Read : Viswam OTT : ఆ పండుగ రోజే ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్దమవుతున్న ‘విశ్వం’

BreakingLawrence BishnoiSalman KhanUpdatesViral
Comments (0)
Add Comment