Bipasha Basu : క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన మరో బాలీవుడ్ హాట్ బ్యూటీ

బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది బిపాసా బసు...

Bipasha Basu : సినిమా ఇండస్ట్రీలో తరచుగా వినిపిస్తున్న సమస్య.. క్యాస్టింగ్ కౌచ్. చాలా మంది హీరోయిన్స్ తాము ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాం అని షాకింగ్ విషయాలను బయట పెట్టారు. దైర్యంగా మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కున్న సమస్యలను బయట పెడుతున్నారు. కొంతమంది అవకాశాల కోసం లోబర్చుకుంటారు అని చెప్పి షాక్ ఇచ్చారు. అవకాశాలు ఇప్పిస్తామని చాలా మంది మోసం చేస్తూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాను అని తెలిపింది.స్టార్ హీరోయిన్ క్రేజ్ ఉన్న ఈ బ్యూటీ కూడా తాను క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాను అని చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు.

Bipasha Basu Comments

బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది బిపాసా బసు(Bipasha Basu). ఈ ముద్దుగుమ్మ చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లకు పైగా ఉంది. ఇటీవ‌ల ఆమె సినిమా ప‌రిశ్ర‌మ‌కు దూరంగా ఉంటున్నారు. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది బిపాసా. ఈ ముద్దుగుమ్మ బోల్డ్ పాత్రలతో చాలా సార్లు వార్తల్లో నిలిచింది. ఈ బ్యూటీ తాజాగా తాను కూడా కాస్టింగ్ కౌచ్‌ బారిన పడినట్టు తెలిపింది.బిపాసా బసు చాలా బోల్డ్ సినిమాల్లో కనిపించింది. హాట్ సీన్స్ చేయడానికి ఎప్పుడూ వెనుకాడదు. ఇది కేవలం సినిమాల్లో మాత్రం. అయితే బిపాసా(Bipasha Basu) పై కొందరి అభిప్రాయం వేరు. గతంలో ఓ ప్రముఖ నిర్మాత తనను వేధించాడని తెలిపింది బిపాసా.

‘నేనుగతంలో ఓ ప్రముఖ నిర్మాతతో ఓ సినిమాకు సంతకం చేశాను. ఆతర్వాత ‘మిస్సింగ్ యువర్ స్మైల్’ అంటూ నిర్మాత నాకు మెసేజ్ చేస్తూనే ఉన్నారు. నాకు వింతగా అనిపించింది. నేను పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత నిర్మాత మరో మెసేజ్ పంపాడు’ అని బిపాసా తెలిపింది.‘నేను నా సెక్రటరీని పిలిచి అడిగాను. ఈ నిర్మాతలు ‘మిస్సింగ్ యువర్ స్మైల్’ అని ఎందుకు నాకు మెసేజ్ చేస్తున్నాడు. అని అడిగాను. దాంతో అతను నాకు అసలు విషయం చెప్పాడు. ఆ నిర్మాతకు నేను స్ట్రాంగ్ రిప్లే ఇచ్చాను. ఆ తర్వాత ఎలాంటి మెసేజ్ రాలేదు. ఆ తర్వాత సినిమా నుంచి తప్పుకున్నాను. అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇచ్చేయడానికి వెళ్లగా.. అతను తీసుకోలేదు’ అని బిపాసా తెలిపింది.

Also Read : Keerthy Suresh : బాలీవుడ్ డెబ్యూ పై కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

Bipasha Basucasting coutchCommentsUpdatesViral
Comments (0)
Add Comment