Bigg Boss Vasanthi: పెళ్లి పీటలెక్కిన ‘బిగ్‌బాస్’ బ్యూటీ వాసంతి !

పెళ్లి పీటలెక్కిన 'బిగ్‌బాస్' బ్యూటీ వాసంతి !

Bigg Boss Vasanthi: టాలీవుడ్ లో పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తోంది. దిల్ రాజు మేనల్లుడు అశీష్ రెడ్డి ఇటీవల జైపూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోగా… రకుల్ ప్రీత్ ప్రస్తుతం గోవా డెస్టినేషన్ వెడ్డింగ్ లో ఉంది. తాజాగా తెలుగు బిగ్‌బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న నటి వాసంతి కృష్ణన్ పెళ్లి చేసుకుంది. తన సొంతూరు తిరుపతిలో ప్రియుడు పవన్ కళ్యాణ్‌ తో ఏడడుగులు వేసింది. కుటుంబ సభ్యుల సమక్షంలో మంగళవారం అర్థరాత్రి ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు వాసంతికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Bigg Boss Vasanthi Marriage Updates

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతికి చెందిన వాసంతి… ‘సిరిసిరి మువ్వలు’ సీరియల్‌ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. గోరింటాకు, గుప్పెడంత మనసు సీరియల్స్‌లోనూ ఈమె యాక్ట్ చేసింది. గతేడాది ‘భువన విజయం’ లాంటి పలు చిన్న చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించింది. తెలుగుతో పాటు కన్నడలోనూ ఈమె పలు సినిమాలు చేసింది. ఇటీవల బిగ్ బాస్ తెలుగులో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన పవన్ కళ్యాణ్‌ తో వాసంతి కృష్ణన్(Vasanthi)… గతేడాది ప్రేమలో పడింది. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబరులో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. అయితే వాసంతిలానే ఆమె భర్త పవన్ కూడా నటుడే. హీరోగా ఓ రెండు సినిమాలు చేస్తున్నాడు.

Also Read : Dadasaheb Phalke Film Festival: దాదా సాహేబ్ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో సత్తా చాటిన జవాన్, యానిమల్ సినిమాలు!

Bigg BossVasanthi
Comments (0)
Add Comment