Bigg Boss Telugu Season 8: దాదాపు అన్ని భారతీయ భాషల్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన టెలివిజన్ రియాల్టీ షో బిగ్ బాస్. తెలుగు, తమిళ, కన్నడ, హింది ఇలా దాదాపు అన్ని భాషల్లో ప్రేక్షకుల మనసులు దొచుకుంది. సల్మాన్, కమల్ హాసన్, జూనియర్ ఎన్టీఆర్, కింగ్ నాగార్జున ఇలా చాలా మంది స్టార్ హీరోలు హోస్టులుగా వ్యవహరిస్తున్న ఈ రియాల్టీ షోకు… సీజన్ సీజన్ కు అభిమానుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే ఏడు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు… ఇప్పుడు 8వ సీజన్ తో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమౌతోంది.
Bigg Boss Telugu Season 8 Teaser
ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 8(Bigg Boss Telugu Season 8) తెలుగు సీజన్ కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 7 సీజన్‌లు విజయవంతంగా ముగియడంతో తాజాగా కొత్త సీజన్ ఎప్పుడు వస్తుందా అని నెట్టింట తెగ చర్చలు జరుగుతున్నాయి. మొదటగా ఈ సీజన్ లోగోను లాంచ్ చేయడంతో బిగ్ బాస్ బజ్ మొదలైంది. తాజాగా టీజర్‌ను విడుదల చేసి మరింత హైప్‌ను క్రియేట్ చేశారు. బిగ్‌బాస్ సీజన్ 8కు సంబంధించిన టీజర్ శుక్రవారం విడుదలైంది. గత కొన్ని సీజన్ల నుంచి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న నటుడు నాగార్జున ఈసారి కూడా హోస్ట్‌గా కనిపించనున్నారు. ఆగష్టు చివరి వారం లేదా సెప్టెంబర్ తొలి వారంలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కావచ్చిన సమాచారం.
బిగ్ బాస్ టీజర్ ఆసక్తిని కలిగించేలా ఉంది. టీజర్ మొత్తం నాగార్జున- కమెడియన్ సత్య మధ్య కొనసాగుతుంది. దొంగతనం చేసేందుకు ఒక షాపులోకి సత్య ఎంట్రీ ఇస్తే నాగార్జున ప్రత్యక్షమవుతాడు. నాగార్జున కింగ్ లా వచ్చి ఏం కావాలో కోరుకోవాలంటూ వరం ఇస్తాడు. కానీ, అడిగేముందు ఒక్కసారి ఆలోచించుకోమని నాగ్ చెప్తాడు. ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అంటూ చెప్పడంతో టీజర్ ముగుస్తుంది.
Also Read : Rakshit Shetty: కాపీరైట్ ఉల్లంఘన కేసులో రక్షిత్ శెట్టికి బెయిల్ !