Bigg Boss: బిగ్‌బాస్‌ 8 లో వేణుస్వామి, బర్రెలక్క ?

బిగ్‌బాస్‌ 8 లో వేణుస్వామి, బర్రెలక్క ?

Bigg Boss: బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 8 త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సారి బిగ్ బాస్(Bigg Boss) లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. బిగ్ బాస్ రియాలిటీ షో… ఇచట అన్నిరకాల సెలబ్రిటీలు ఉంటారు అనే విధంగా ఈ సీజన్ 8 సన్నద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. వెండితెర, బుల్లితెర, సోషల్‌ మీడియా.. కాదేదీ బిగ్‌బాస్‌కు అనర్హం అన్నట్లుగా భిన్న రంగాలకు చెందిన వారినీ ఈ సారి తీసుకు రావడానికి నిర్వాహకులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అలా ఇప్పటివరకు నటీనటులు, కొరియోగ్రాఫర్లు, దర్శకులు, సింగర్లు.. ఇలా అందరినీ పట్టుకొచ్చారు. అయితే ఈసారి ఓ జ్యోతిష్యుడిని హౌస్‌లోకి తీసుకొస్తున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Bigg Boss – బిగ్‌బాస్‌ షోలో వేణుస్వామి ?

అతడే వేణుస్వామి… టీవీలో, యూట్యూబ్‌ ఛానల్‌ లో జ్యోతిష్యం చెప్తూ తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్‌ అయ్యాడు. సినీ సెలబ్రిటీల కెరీర్‌ గురించి కూడా ముందుగానే అంచనా వేస్తుంటాడు. కొందరు తారలు కెరీర్‌లో ముందుకు వెళ్లాలని ఆయనతో ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. ఇందుకోసం లక్షల్లోనే తీసుకుంటాడు. ఇలా పూజలు, హోమాలు అంటూ వేణుస్వామి లక్షల్లోనే సంపాదిస్తాడు. ఇటీవల ఏపీ, తెలంగాణా ఎన్నికల ఫలితాలపై తాను చెప్పిన జోస్యం తప్పు అని తేలింది. ముఖ్యంగా ఏపీలో జరిగిన ఎన్నికల ఫలితాలు వేణుస్వామికి తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఈనేపథ్యంలోనే తాను బహిరంగ క్షమాపణ చెప్పి జోతిష్యం చెప్పడానికి విరామం ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ టీమ్‌ వేణుస్వామిని హౌస్‌లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందట.

వేణు స్వామితో పాటు ఇటీవల సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న కుమారి ఆంటీ, బర్రెలక్క, కిర్రాక్ ఆర్పీ, కుషిత కళ్లపు, సోనియా సింగ్ కూడా బిగ్ బాస్ హౌస్ లోనికి వస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంత నిజముందన్నది రానున్న రోజుల్లో తెలియనుంది.

Also Read : Manisha Rani: తండ్రికి ఖరీదైన కారు గిఫ్టిచ్చిన బిగ్‌బాస్‌ బ్యూటీ మనీషా !

Bigg BossBigg Boss TeluguDisney Hot StarKumari AuntyVenu Swamy
Comments (0)
Add Comment