Wedding Celebrations : బుల్లితెర నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన సీరియల్స్‌లో నటించి మంచిపేరు సంపాదించుకున్నాడు. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్5లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్‌గా కొనసాగి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు.
బిగ్ బాస్ తర్వాత మానసన్‌ను ఎన్నో ఆఫర్స్ రావడంతో ఆయన అటు జీ తెలుగు, ఇటు మాటీవీలో బిజీగా ఉంటూనే, వెబ్ సీరీస్‌లలో కూడా నటిస్తున్నాడు.
Wedding Celebrations :
అయితే ఇటీవల మానస్ శ్రీజ అనే అమ్మాయితో ఘనంగా నిశ్చితార్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఆయన పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది.ఇప్పటికే హాల్దికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియోలను మానస్ ,తన తల్లి కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి. ఈరోజు రాత్రి 8 గంటలకు మానస్ వివాహం జరగబోతున్నదంట. అంతే కాకుండా మానస్ మ్యారేజ్‌కు బుల్లితెర నటీనటులు పెద్ద ఎత్తున హాజరకానున్నట్లు సమాచారం.
Also Read : Sudheer : రష్మీతో పెళ్లిపై సుధీర్ క్లారిటీ?